మొదట్లో సావిత్రి బయోపిక్‌ని 'మహానటి' పేరుతో తీస్తున్నారని తెలియగానే ఏముంది అంతా ఏడుపే కదా.. ట్రాజెడీ తప్పఏముంటుంది? అందులోనూ ఆర్దిక ఒడిదుడుకులలో ఉన్న అశ్వనీదత్ కుమార్తెలు, ఆయన అల్లుడు. ఒకే ఒక్క సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం' మాత్రమే తీసిన నాగ్‌అశ్విన్ దర్శకుడు అనడంతో పెదవి విరుపులు వచ్చాయి. ఇక ఈ చిత్రాన్ని నిన్నటితరంకి చెందిన, సావిత్రి గురించి తెలిసిన ముసలి ముతకా తప్పితే యూత్ చూడదని తేల్చేశారు. ఇక కీర్తి సురేష్‌ని సావిత్రిగా, దుల్కర్ సల్మాన్‌ని జెమిని గణేషన్‌గా తీసుకోవడంతో అందరు ఈ చిత్రాన్ని పట్టించుకోవడం మానివేశారు. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత మీడియావారు కూడా 5 పాయింట్స్‌కి 4 రేటింగ్‌లు ఇస్తుండటం విశేషం. ముఖ్యంగా థియేటర్లు యూత్‌తో నిండిపోతున్నాయి. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ ని తప్ప ఇంత గొప్పగా ఎవరిని చూడలేదని విమర్శకుల నుంచి అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ ఐటీమంత్రి, రాజమౌళి, రాఘవేంద్రరావు నుంచి అందరు ఈ చిత్రం దర్శకనిర్మాతలు, యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ చూపించిన నటనా ప్రతిభ ఎవ్వరూ చూపించలేదని, ఇక దుల్కర్ సల్మాన్ కైతే తాము ఫ్యాన్స్‌కి మారిపోయామని రాజమౌళి, కేటీఆర్ వంటి వారు ప్రశంసిస్తున్నారు. ఇక ఇందులో నటించిన మోహన్‌బాబు స్పందిస్తూ, ఇంత మంచి చిత్రంలో నాకు పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉంది. డబ్బు పరంగా, ఇతర విషయాలలోకూడా ఎంతో రిస్క్ చేసిన స్వప్న, నాగ్‌అశ్విన్‌లు ఇలాంటి గొప్పచిత్రాలే తీయాలి. ఈ బిడ్డలునిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక రాఘవేంద్రరావు స్పందిస్తూ 28ఏళ్ల కిందట 'జగదేకవీరుడు అతిలోక సుందరి' అనే భారీ బడ్జెట్‌చిత్రాన్ని తీశాం. నాడు ఈ రోజుల్లో వరదలు తుఫాన్ వచ్చాయి. ఇంత రిస్క్ ప్రాజెక్ట్‌కి ఇదేమి ఆటంకం అనుకున్నాం. ఎప్పుడు వరదలు తగ్గుతాయో అని నిరీక్షించాం, సాయంత్రం నుంచి జనాలతో థియేటర్లు పోటెత్తాయి.నాడు దత్తు ఎంతో ఆనందపడ్డాడు. మరలా ఇంతకాలానికి అలాంటి మరోప్రయోగమే సావిత్రి ద్వారా 'మహానటి'గా ఆయన కుమార్తెలు తీశారు. ఈ చిత్రం యూనిట్‌కి, దత్తు కుటుంబానికి, నాగ్‌అశ్విన్‌కి శుభాకాంక్షలు అన తెలిపాడు.