Advertisement
Google Ads BL

అర్జున్‌రెడ్డి రూటే సపరేట్‌..!


సాధారణంగా ప్రముఖులే కాదు.. సాధారణ వ్యక్తులు కూడా తమ స్థాయికి తగ్గట్లు తమ బర్త్‌డే వేడుకలను స్నేహితులు, బంధువులతో పార్టీ రూపంలోఏ రిసార్ట్స్‌లోనో, హోటల్‌, రిసార్ట్స్‌లో జరుపుకుంటూ ఉంటారు. కానీ అర్జున్‌ రెడ్డిగా అందరికీ పరిచితమైన విజయ్‌ దేవరకొండ మామూలుగా తన యాటిట్యూడ్‌ మాత్రమే కాదు... తన రూటే సపరేట్‌ అని నిరూపించుకున్నాడు. ఈయన తన 29వ బర్త్‌డే కానుకగా కేవలం సన్నిహితులకే కాదు..హైదరాబాద్‌ వాసులందరికీ పార్టీ ఇచ్చాడు. ఈ బర్త్‌డే రోజునే ఆయన నటించిన 'మహానటి' కూడా విదుదలై ఘనవిజయం సాధిస్తోన్న సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇక విజయ్‌ దేవరకొండ తన బర్త్‌డే సందర్భంగా కొన్నిరోజులుగా ఎండల్లో పనిచేయడం వల్ల నాకు ఓ ఆలోచనవచ్చింది. మూడు ఐస్‌క్రీమ్‌ ట్రక్స్‌ని సిటీ మొత్తం తిప్పుతూ, పనుల నిమిత్తం ఎండలో తిరిగే వారికి ఐస్‌క్రీంలు ఉచితంగా ఇస్తే బాగుంటుందని ఆలోచించాడు. ట్రాఫిక పోలీసులు, చిన్నారులు. చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులకు ఐస్‌క్రీమ్‌లని ఉచితంగా ఇచ్చాడు. ఈ ఐస్‌క్రీమ్‌ ట్రక్స్‌మీద 'విజయ దేవరకొండ ఐస్‌క్రీం ట్రక్స్‌' అని రాసి ఉన్నాయి. ఈ ట్రక్స్‌పై ఆయన ఫొటోలు కూడా ఉన్నాయి. 

ఈయన మాట్లాడుతూ, సహజంగా బర్త్‌డే లు జరుపుకోవడం నాకు అసహ్యం. నా పుట్టినరోజును నేనెప్పుడు జరుపుకోలేదు. నేను చేసే పనులపై ఆసక్తి చూపడాన్ని ఇష్టపడతాను. ఒక మంచి సినిమాలో నటించడం, లేదా నటనను మెచ్చుకోవడం వంటివి చేస్తాను. నా బర్త్‌డే సందర్భంగా ఐస్‌క్రీమ్‌లు పంచడం అనే పని మంచిదేనని నేను భావిస్తున్నాను అని చెప్పాడు. ఇక ఇటీవల రామ్‌చరణ్‌ కూడామంచు లక్ష్మి 'మేముసైతం' కోసం సారధి స్టూడియో వద్ద ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌ వంటివి అమ్మిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ఇద్దరు కలిసి హిమ క్రీములు అమ్మారు...! 

Vijay Devarakonda Ice Cream Trucks:

VIjay Deverakonda hires 3 trucks to distribute ice creams in hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs