Advertisement
Google Ads BL

మహేష్ కూడా రాయలసీమ బ్యాగ్డ్రాప్ లోనే..!


ప్రస్తుతం భరత్ అనే నేను విజయంతో ఫుల్ ఖుషీగా ఉన్న మహేష్ బాబు భార్య పిల్లల్తో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. సమ్మర్ వెకేషన్స్ ని సితార, గౌతమ్, నమ్రతలతో సెలెబ్రేట్ చేసుకుంటున్న మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. మహేష్ 25 మూవీ వంశి పైడిపల్లి దర్శకత్వంలో అతి త్వరలోనే పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను లో యంగ్ సీఎం గా మహేష్ బాబు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ కి పనిచేసి సూపర్బ్ అనిపించాడు. మరి వంశి పైడిపల్లి మూవీలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది. అలాగే ఈ సినిమా బ్యాగ్ద్రోప్ ఏమిటనే దాని మీద ప్రస్తుతం అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.

Advertisement
CJ Advs

ఇప్పటికే వంశి పైడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా  పూర్తి చేసాడు. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో వంశి పైడిపల్లి, మహేష్ కోసం సిద్ధం గా వున్నాడు. ఇక ఈ సినిమా కి సంబందించిన కొన్ని లొకేషన్స్ కోసం వంశి పైడిపల్లి ఆమధ్యన అమెరికా వెళ్ళొచ్చాడు. అలాగే ఈ సినిమా కథ ప్రకారం ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలో జరుగుతుందనే విషయాన్ని వంశి పైదిపల్లె స్వయంగా చెప్పాడు. మరి వంశి అలా చెప్పాడో లేదో.. ఇలా మహేష్ అభిమానులు మహేష్ 25  వ సినిమా కథ అమెరికా బ్యాగ్ద్రోప్ లో ఉండబోతుందంటూ ఫిక్స్ అయ్యారు. 

కానీ వంశి - మహేష్ బాబుల సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందనుందనేది తాజాగా అందుతున్న సమాచారం. మరి ఇప్పటివరకు మహేష్ ఎప్పుడు రాయలసీమ బ్యాగ్ద్రోప్ లో సినిమా లు చెయ్యలేదు. అప్పట్లో ఒక్కడు సినిమా రాయలసీమ బ్యాగ్ద్రోప్ లో వచ్చినప్పటికీ... ఇప్పుడు చేస్తున్న కథలాంటి కథ మహేష్ ఎప్పుడు టచ్ చెయ్యలేదని టాక్ వినబడుతుంది. మరి కేవలం మహేష్ మాత్రమే కాదండోయ్... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల సినిమా కూడా రాయలసీమ బ్యాగ్ద్రోప్ లోనే తెరకెక్కుతుందనే సమాచారం వుంది. మరి మహేష్, ఎన్టీఆర్ లు ఒకేసారి రాయలసీమ వెళ్లడమే కాదు... వీరికి మరో కామన్ పాయింట్  ఉంది. అదేమిటంటే.... ఈ యిద్దరి సినిమాల్లోనూ పూజ హెగ్డెన్ హీరోయిన్ కావడం మరో విశేషం.

Mahesh And NTR Prefer Rayalaseema:

Mahesh Babu and NTR's Films with Rayalaseema Backdrop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs