Advertisement
Google Ads BL

నాని వద్దంటే బన్నీ సై అంటాడు..!


సాధారణంగా ఇమేజ్‌, క్రేజ్‌లో నేచురల్‌ స్టార్‌ నాని కంటే బన్నీ చాలా మెట్లు ఎక్కువే. కాగా నానితో తన తదుపరి చిత్రాన్ని చేయాలని విలక్షణదర్శకుడు, 'ఇష్క్‌, మనం, 24' చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ భావించాడు. కానీ 'కృష్ణార్జునయుద్దం' ఫ్లాప్‌తో అంతటి విలక్షణ దర్శకుడిని కూడా నాని సైడ్‌ ఇచ్చేశాడు. అయితే విచిత్రంగా నాని కంటే బన్నీతో చేసే చాన్స్‌రావడం ఏ దర్శకుడికైనా ఆనందం కలిగించే అంశం. ఇక బన్నీ 'నాపేరు సూర్య... నా ఇల్లు ఇండియా' దెబ్బకి తన తదుపరి చిత్రాన్ని విలక్షణంగా, ఇంటెలిజెంట్‌గా ఉండేలా ప్లాన్‌చేసుకుంటున్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs

ఆయనకు సుకుమార్‌, కొరటాల శివలతో సినిమా చేసే అవకాశాలు ఉన్నప్పటికీ మహేష్‌తో 26వ చిత్రం సుకుమార్‌ చేతికి దొరకడం, మరోవైపు కొరటాల శివ చిరంజీవికి స్టోరీ చెప్పిన నేపధ్యంలో అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్నిద్విభాషా చిత్రంగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో చేయనున్నాడని తెలుస్తోంది. ఇక విక్రమ్‌ కుమార్‌ అంటే స్క్రిప్ట్‌ మీదనే కాదు.. సినిమాని షూటింగ్‌కి తీసుకెళ్లిన తర్వాత కూడా నిదానంగా చేస్తాడనే టాక్‌ ఉన్నా కూడా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తాడనే టాక్‌ తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా ఉంది. దీంతో బన్నీ విక్రమ్‌ కెకుమార్‌కి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక విక్రమ్‌కె.కుమార్‌ ఇటీవల అఖిల్‌తో చేసిన'హలో' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. కానీ బన్నీ చిత్రంతో ఈ లెక్కలన్నీ విక్రమ్‌ సరిచేస్తాడని భావిస్తున్నారు.

Allu Arjun To Team Up Vikram K Kumar:

Allu Arjun Next Movie With Vikram K Kumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs