Advertisement
Google Ads BL

'సైరా..' రిలీజ్‌కి కూడా సెంటిమెంటేనా..!


అశ్వనీదత్‌ నిర్మాణంలో చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన మే9వ తేదీన అంటే ఇదే డేటున సావిత్రి బయోపిక్‌ 'మహానటి'ని అశ్వనీదత్‌, ప్రియాంకా, స్వప్నదత్‌లు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే మే 9 వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 151వ చిత్రం'సై..రా..నరిసింహారెడ్డి'ని కూడా వచ్చే ఏడాది మే 9నే విడుదల చేయాలని నిర్మాత రామ్‌ చరణ్‌ ఫిక్స్‌ అయ్యాడట. ఇప్పటికే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారు. గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి అదనంగా సమయం కేటాయించకుండా షూటింగ్‌ పూర్తయిన సీన్‌కి వెంటనే గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లను జరిపిస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయినా ఈ చిత్రం పలు భాషా నటులు, ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రం కావడంతో ఈ మాత్రం సమయం పట్టడం మామూలేనని చెప్పాలి. ఈ చిత్రంలో అమితాబ్‌, విజయ్‌సేతుపతి, నయనతార, కిచ్చా సుదీప్‌, జగపతిబాబు, తమన్నా వంటి పలువురు నటిస్తున్నారు. ఇక మే 9వ తేదీ అంటే అది చిరంజీవికి కూడా ఎంతో సెంటిమెంట్‌ రోజు. ఆయన నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి'తో పాటు ఈయన నటించి, బ్లాక్‌బస్టర్‌ 'గ్యాంగ్‌లీడర్‌' కూడా మే 9వ తేదీనే విడుదలై సంచలన విజయాలను నమోదు చేశాయి. కాబట్టి అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఇదే రోజు 'సైరా...నరసింహారెడ్డి' విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పాలి. 

Sye Raa Release Date Confirmed:

Sye Raa Release Date Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs