Advertisement
Google Ads BL

ఆకాష్‌ పూరీ చెప్పిన సంగతులు..!


పూరీ జగన్నాద్‌ ప్రస్తుతం వరుస పరాజయాల తర్వాత తన కుమారుడు ఆకాష్‌ పూరీని మరోసారి హీరోగా రీఎంట్రీ ఇప్పిస్తూ 'మెహబూబా' చిత్రం తీశాడు. పునర్జన్మల నేపధ్యం, ఇండో పాకిస్తాన్‌ వార్‌ నేపధ్యంలో ఈ చిత్రం ఓ ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రం చూస్తే దీనిని పూరీ తీశాడని ఎవ్వరూ భావించలేరని, అంతగా ఛేంజోవర్‌ అయి ఈ చిత్రాన్ని తీశానని పూరీ చెప్పాడు. ఇక ఈ చిత్రానికి సెన్సార్‌ యు/ఎ సర్టిఫికేట్‌ని ఇచ్చింది. ఈ విషయాన్ని చార్మి తన ట్విట్టర్‌తో తెలిపింది. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం గురించి, ఇతర విషయాల గురించి ఆకాష్‌ పూరీ మాట్లాడుతూ, మేము పవన్‌ కళ్యాణ్‌ గారికి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి పవన్‌ గారు మా తండ్రి పూరీ జగన్నాథ్‌కి మొదటి చిత్రంగా 'బద్రి' అవకాశం ఇవ్వడమే కారణం. మరే హీరో అయినా ఇంతటి క్రేజ్‌ వచ్చి ఉండేది కాదేమో. ఇక నేను చిన్ననాటి నుంచి రవి తేజను చూస్తూ పెరిగాను. మా నాన్న ఆయనతో చేసిన 'ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' వంటి చిత్రాలు చూస్తూ ఎదిగాను. 

ఇక మా తండ్రి పూరీ జగన్నాథ్‌తో పాటు రవితేజ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇక నేను ఏ స్టార్‌తో నటించాలని ఉందంటే చెప్పలేను. వారంతా ఎంతో కష్టపడి స్టార్స్‌ అయ్యారు. ముందు నేను ఆ హీరోలతో కలిసి నటించే అర్హతను సంపాదించాల్సివుంది. నాకు అనుష్క అంటే బాగా ఇష్టం. ఇక మా అమ్మ నన్నెంతో క్రమశిక్షణగా పెంచింది. ఆమె వల్లే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి? ఎలా బిహేవ్‌చేయాలి? ఎలా ఇతరులను గౌరవించాలి? అనేవి నేర్చుకున్నాను. రేపు నాకు వ్యక్తిగతంగా మంచిపేరు వస్తే మాత్రం ఆ క్రెడిట్‌ మా అమ్మకే ఇస్తాను.. అని పూరీ చెప్పుకొచ్చాడు. ఇక ఈచిత్రం 11వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. 

Akash Puri Interview:

Akash Puri Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs