Advertisement
Google Ads BL

పవన్‌ పై సెటైర్‌ పేల్చాడు..!


గతకొంతకాలంగా మౌనంగా ఉన్న వర్మ మరోసారి సోషల్‌ మీడియాలో రెచ్చిపోయాడు. ఈయన ప్రస్తుతం నాగార్జున హీరోగా 'ఆఫీసర్‌' అనే చిత్రం చేస్తున్నాడు. ఈనెల 25న రిలీజ్‌ కానున్న ఈ చిత్రం పై ఎవరికీ ఎలాంటి నమ్మకాలు లేవు. నాగార్జున ఇలా వర్మతో సినిమా చేయడం ఏమిటని? అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ టీజర్‌ని వర్మ రిలీజ్‌ చేశాడు. కానీ అది ఎవ్వరినీ మెప్పించలేకపోయింది. ఇక తాజగా రెండో టీజర్‌ని విడుదల చేసినా అది మొదటి టీజరే బెటర్‌ అనేలా ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత తాను అక్కినేని అఖిల్‌తో చిత్రం చేయడం కూడా ఖాయమని వర్మ అంటున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రానికి వర్మ దర్శకుడు కావడం, సినిమా టీజర్స్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుండటం, మరోవైపు వర్మ శ్రీరెడ్డి చేత పవన్‌ని తానే తిట్టించానని చెప్పడం, 'ఆఫీసర్‌' కి నిర్మాత కూడా వర్మనే కావడంతో నాగార్జున పట్ల కాస్త పాజిటివ్‌గా ఉండే మెగా ఫ్యాన్స్‌ కూడా ఈ చిత్రం విషయంలో వర్మని ఆడుకుంటున్నారు. అయినా తగ్గితే అతను వర్మ ఎందుకు అవుతాడు? దాంతో తాజాగా ఆయన పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి సెటైర్‌ వేశాడు. 'ఆఫీసర్‌' చిత్రం టీజర్‌కి సోషల్‌మీడియాలో కేవలం 11వేల డిజ్‌లైక్స్‌ వచ్చాయని, మరి కోట్లాది మంది ఫ్యాన్స్‌ ఉన్నారని చెప్పుకునే స్టార్‌కి అభిమానులు కేవలం 11 వేల మందేనా? అని దెప్పి పొడిచాడు. పవన్‌ ఫ్యాన్స్‌ 'ఆఫీసర్‌' టీజర్‌ విషయంలో డిస్‌లైక్స్‌తో విరుచుకుపడుతున్నారని వార్తలు వస్తున్న వేళ వర్మ ఇలా పవన్‌ ఫ్యాన్స్‌ని కెలికి, ఎలాగైనా తన చిత్రం వార్తల్లో ఉండేట్లు చూసుకుంటున్నాడని ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అర్ధమవుతోంది..! 

RGV Satire On Pawan Kalyan:

<span>RGV Satires On Pawan kalyan</span><span>&nbsp;And His Fans</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs