Advertisement
Google Ads BL

పవర్ స్టార్ అయినా పైకి లేపుతాడా?


అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్రమోషన్స్ విషయంలో చాలా లైట్ తీసుకున్నారనిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు కేవలం ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చేసిన చిత్ర బృందం.... ఇక హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ ఇంటర్వూస్ గాని అల్లు అర్జున్ ఇంటర్వూస్ గాని ఇవ్వలేదు. అయితే ఏదో మహేష్ భరత్ అనే నెను విడుదల తర్వాత సినిమాపై మరింత క్రేజ్ తీసుకురావడానికి గాను థాంక్స్ మీట్, సక్సెస్ సెలెబ్రేషన్స్, అభిమానులతో థియేటర్స్ చుట్టడంలా.. అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటే సక్సెస్ సెలెబ్రేషన్స్, నా పేరు సూర్య రిలీజ్ టూర్స్ అంటూ సందడి చేద్దామనుకున్నాడనే ప్రచారం బాగా జరిగింది.

Advertisement
CJ Advs

కానీ నా పేరు సూర్య  విడుదలైన నాలుగు రోజులకు కూడా ఇప్పటివరకు ఒక సక్సెస్ మీట్ కూడా పెట్టలేదు. మరి సినిమా కి టాక్ తేడా రావడంతోనే ఇలా అల్లు అర్జున్, దర్శకుడు వంశి వక్కంతం, అను లు సైలెంట్ అయ్యారా... ఏది ఎలాగున్నా నా పేరు సూర్య ప్రమోషన్స్ ని మాత్రం గాలికొదిలేశారు. కేవలం ఆర్మీ వాళ్లకు నా పేరు సూర్య స్పెషల్ షో ఒకటి వేయించి చేతులుదులుపుకున్నారు. మరి అసలే కలెక్షన్స్ అంతంత మాత్రంగా వున్న నా పేరు సూర్య కలెక్షన్స్ ఏ మాత్రం హడావిడి లేకపోతె.. ఇంకేం పెరుగుతాయి. ఇప్పటికే నా పేరు సూర్య వీకెండ్ కలెక్షన్స్ ఓ అన్నంత లేవు. ఇక వీక్ డేస్ లో నా పేరు సూర్య హావా తగ్గుమొహం పట్టడమే కాదు.... ఈ రోజు విడుదలైన మహానటి ప్రభంజనం ఎక్కువగా  కనబడుతుంది. 

మరి సోమవారమే అంతంత మాత్రం ఉన్న నా పేరు సూర్య క్రేజ్.. మహానటి కారణంగా మొత్తం ముగిసేలా కనబడుతుంది. మరి అల్లు అర్జున్ సినిమాకి యావరేజ్ టాక్ పడినా కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ లో ఉంది. అలాంటి టైం లోనే ప్రమోషన్స్ తో కాస్త హైప్ తీసుకొస్తే ఏమన్నా పని జరిగేది. కానీ సినిమా ఎలాగూ పోయింది లే... మళ్ళీ ప్రమోషన్స్ కి డబ్బు ఖర్చెందుకు అనుకున్నారేమో అల్లు అర్జున్ బ్యాచ్. అందుకే ప్రమోషన్స్ ని పక్కన పడేసి కూల్ గా వున్నారు.

Pawan Boost for Naa Peru Surya:

Pawan Kalyan Chief Guest for Naa Peru Surya Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs