Advertisement
Google Ads BL

రజనీ మనవడు అందరికీ ముద్దే..!


ఉన్నవాళ్ల బిడ్డ ఊరందరికీ బిడ్డగా గారాలు పోవడం సాధారణమే. ఇక విషయానికి వస్తే హిమాలయాలకువెళ్లి, అటు నుంచి అటు అమెరికా వెళ్లి తన హెల్త్‌ చెకప్ చేయించుకుని తాజాగా చెన్నై వచ్చాడు రజినీకాంత్. ఇక ఈయన తన మనవడు వేద్‌కృష్ణ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నాడు. తన కుమారుడి బర్త్‌డే సందర్భంగా రజనీకాంత్‌ చిన్నకుమార్తె సౌందర్య తన మనవడితో కలిసి రజనీ తీసుకున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. మూడేళ్ల కిందట ఈ ఏంజెల్‌ తన జీవితంలోకి వచ్చాడని, తన బేబీ బర్త్‌డే వేడుకలను తమ బంధువులతో జరుపుకుంటున్నామని ఆమె తెలిపింది. ఈ బర్త్‌డే వేడుకల్లో రజనీ పెద్దకుమార్తె ఐశ్వర్య,, అల్లుడు ధనుష్‌లు కూడా పాల్గొని ఫొటోలు తీసుకున్నారు. వేడుకకు వచ్చిన ప్రతి ఒకరు వేద్‌కృష్ణని ఎత్తుకుని ఫొటోలు దిగారు. 

Advertisement
CJ Advs

ఇక సౌందర్య రజనీకాంత్‌ విషయానికి వస్తే ఆమె చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ని 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బాబు మాత్రం సౌందర్యతోనే ఉన్నాడు. ఇక మరో విషయం ఏమిటంటే.. రజనీ ఎంత ఎత్తుకు ఎదిగినా డౌన్‌టు ఎర్త్‌ ఉంటాడని తాజాగా జరిగిన ఓ సంఘటన నిరూపిస్తోంది. కాస్త సెలబ్రిటీ హోదా వస్తేనే కళ్లు నెత్తికెక్కే సెలబ్రిటీలు ఉన్నతరుణంలో రజనీ తన సింప్లిసిటీ ఏమిటో దేశంగాని దేశంలో చూపించాడు. అభిమానులు డెమీ గార్డ్‌గా భావించే రజనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 

కర్ణాటకలో 'కాలా'కి గుడి కట్టి మరీ పూజిస్తున్నారు. ఆయన తన అభిమానులతో ఎంతో సన్నిహితంగా, ఏమాత్రం గర్వం లేకుండా ఉంటారని మరోసారి నిరూపితం అయింది. తాజాగా అమెరికాలో ఉన్న రజనీకాంత్‌ తన పొరుగు వారికి షాకిచ్చాడు. అది కూడా స్వీట్‌ షాక్‌. తన ఇంటికి వెళ్తున్న రజనీని పక్కింటి వారు అయిన ఆ భారతీయ సంతతి ఇంటి పెద్ద తమ ఇంటికి రజనీని ఆహ్వానించాడు. దాంతో సామాన్యుడిలా రజనీ ఆ ఇంట్లోకి వెళ్లి ఆ కుటుంబీకులకు షాక్‌ఇచ్చాడు. తమ అభిమాన హీరో తమ ఇంటికి రావడంతో ఇంట్లోని అందరు షాక్‌కి గురయ్యారు. ఈ సందర్భంగా ఆ ఇంట్లోని అందరు తలైవాతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలోవైరల్‌గా మారింది. 

Rajinikanth at Grandson Birthday celebrations:

Rajinikanth grandson Ved Birthday Party Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs