Advertisement
Google Ads BL

తారక్‌ అయితే బాగుండేది..!


సావిత్రి బయోపిక్‌ మహానటి విడుదలయింది. ఇక ఈ చిత్రంలోని ఎస్వీరంగారావు, కెవిరెడ్డి, సింగీతం శ్రీనివాసరావు, జర్నలిస్ట్‌ మధురవాణి, మరో జర్నలిస్ట్‌గా విజయ్‌దేవరకొండ,సావిత్రి, జెమినిగణేషన్‌, జెమిని గణేషన్‌ భార్యల్లో ఒకరైన అలమేలు పాత్రలో మాళవికనాయర్‌.. ఇలా పలు పాత్రలకు పలువురు ఉద్దండులు నటించారు. ఇక ఏయన్నార్‌ పాత్రని ఆయన మనవడు నాగచైతన్య రక్తి కట్టించాడు. ఇక సావిత్రితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించిన ఎన్టీఆర్‌ పాత్రను తారక్‌ చేస్తే భలే ఉండేది. అనేది మాత్రం సినిమా చూసిన వారు అనుకునే మాట. 

Advertisement
CJ Advs

దీని గురించి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ పాత్రలో తారక్‌ని తప్ప ఎవ్వరిని ఊహించుకోలేం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పాత్రను చేయలేదు. అయితే ఇప్పుడు అభిమానులకు సంతృప్తిని కలిగించే విధంగా ప్రయత్నం చేశాం. డిజిటల్‌ అనుకోండి, మరైదైనా అనుకోండి. మొత్తానికి అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. సినిమా విడుదలైన తర్వాత అంతా మీకే తెలుస్తుంది అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. 

ఇక మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్‌, దర్వకుడు క్రిష్‌, రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా, దివ్యవాణి, రాజేంద్రప్రసాద్‌ మనవరాలు, హాయ్‌రబ్బా స్మిత కూతురు, కీర్తిసురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌లతో పాటు సావిత్రి ప్రాణస్నేహితురాలు గెటప్‌లో 'అర్జున్‌రెడ్డి' ఫేమ్‌ షాలినిపాండే కలిసి నటిస్తున్నారు. సావిత్రికి ఎంతో ప్రాణస్నేహితురాలైన సుశీల గెటప్‌లో నుదుటన పెద్ద బొట్టు, తలనిండా మల్లెపూలు, ఎర్రని చీరలో షాలిని కూడా ఆకట్టుకుంటోంది..! 

Audience Response on NTR Role in Mahanati:

Digital NTR in Mahanati Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs