Advertisement
Google Ads BL

టాలీవుడ్ లో కాపీల గొడవలెక్కువైనాయ్!


'బాహుబలి'కి ముందు వేరు.. 'బాహుబలి' తర్వాత టాలీవుడ్‌ వేరు అని చెప్పాలి. ఒకరకంగా ఈ 'బాహుబలి' కొందరికి ఆనందాన్ని అందిస్తే, కాపీరాయుళ్లకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఈ చిత్రంతో టాలీవుడ్‌ రేంజ్‌, మార్కెట్‌ పరిధి విపరీతంగా పెరగడంతో ఒకప్పటిలా మన దర్శకులు హాలీవుడ్‌ చిత్రాలను, ఇతర విదేశీ చిత్రాలను కాపీ కొట్టాలంటే భయపడుతున్నారు. ఇక మన త్రివిక్రమ్‌ సంగతి తెలిసిందే. మన పాత చిత్రాలను, ఇతర కథని నుంచి స్పూర్తి అనే పేరుతో పక్కాగా కాపీ కొడుతున్నాడు. అలాంటిది 'అజ్ఞాతవాసి' చిత్రం విషయంలో మాత్రం ఈయన దివాలాకోరుతనం పూర్తిగాబయట పడింది. 

Advertisement
CJ Advs

ఇక నేను ఎప్పటినుంచో ఓ హానెస్ట్‌ సినిమా చేయాలని భావిస్తున్నాను. 'నాపేరు సూర్య..నా ఇల్లుఇండియా'తో అది చేశానని బన్నీ, ఈ చిత్ర నిర్మాతలు చెప్పిన మాటలు కూడా ఇప్పుడు హుళక్కే అనే నిర్ణయానికి వస్తున్నారు సినీ అభిమానులు. 'నాపేరు సూర్య' చిత్రం కూడా 2002లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం 'యాంటోన్‌ ఫిషర్‌'కి కాపీనే అని సినీ ప్రేమికులు అంటున్నారు. ఇక ఇది యాంటోన్‌ ఫిషర్‌ అనే వ్యక్తి తన వ్యక్తిగత జీవితం ఆదారంగా, సహనిర్మాతగా వ్యవహరిస్తూ ఈ చిత్రం చేశాడు. ఇందులో చిన్ననాటి నుంచి తీవ్ర వేధింపులు, తిట్లకు గురైన వ్యక్తి తర్వాత యూఎస్‌ నేవీలో సైలర్‌గా మారుతాడు. కానీ చిన్ననాటి నుంచి జరిగిన సంఘటనల వల్ల విపరీతమైన కోపంతో ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అవుతాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్‌గా చేస్తూ తన తల్లిదండ్రులను వెత్తుకుంటూ ఉంటాడు. 'నాపేరు సూర్య' కూడా ఇదే లైన్‌లో రూపొందింది. 

కానీ చిన్ననాటి కష్టాలను మాత్రం కట్‌ చేశారు. దాంతో బన్నీ క్యారెక్టర్‌ అంత కోపిష్టిగా ఎందుకు ఉంటుంది అనేది జనాలకు అర్ధం కాదు. ఇక సైకియాట్రిస్ట్‌ ప్లేస్‌లో తండ్రిని ఎంటర్‌ చేశారు. ఇక తాజాగా మహేష్‌బాబు 25వ చిత్రం కూడా ఓ హాలీవుడ్‌కి ఫ్రీమేక్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం యూఎస్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. జూన్‌ 7న షూటింగ్‌ మొదలుకానుంది. ఇది ఇద్దరు స్నేహితుల కథ అని, లవ్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని ఆ ఇద్దరు స్నేహితులే మహేష్‌, అల్లరినరేష్‌ అంటున్నారు.ఇది కాపీ అనే విషయాన్ని వంశీ పైడిపల్లి ఖండించినా కూడా ఆయన గత చిత్రాలైన 'ఎవడు, ఊపిరి' కూడా హాలీవుడ్‌ చిత్రాలకు ఫ్రీమేక్‌ అన్నది తెలిసిందే.

Copy allegations on Naa Peru Surya and Mahesh 25th Stories:

Copycat run in Tollywood Industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs