ఎక్కడైనా సరే అందరు కలిసి ఉంటే ఎవ్వరూ చెప్పుకోరు. అదే వారి మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు వస్తే చాలు దానికి చిలువలు పలువలు చేరుస్తారు. ఇక తమకెరీర్ ప్రారంభంలో హరికృష్ణ ఇద్దరు కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు పెద్దగా టచ్‌లో లేరనేది వాస్తవం. నాడు హరికృష్ణ కూడా కాస్త ఎన్టీఆర్‌ని దూరం పెట్టాడని వార్తలు వచ్చాయి. మొత్తానికి కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు బాగా సన్నిహితంగా మారారు. ఇక ఏకంగా నందమూరి కళ్యాణ్‌రామ్‌కి 'కిక్2'లో భారీ నష్టాలు వచ్చి, సినిమా రిలీజ్‌కి కూడా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఆర్దికంగా ఆదుకుని, తర్వాత నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా 'జైలవకుశ' చిత్రం కూడా చేశాడు.
ఇక వీరిమద్య అనుబంధం బాగా ఉందని అందరు చెప్పుకుంటున్న సమయంలో బాలయ్య మొదలుపెట్టిన 'ఎన్టీఆర్'బయోపిక్ లాంచ్‌కి ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందలేదు. కానీ కళ్యాణ్‌రామ్‌కి మాత్రం ఆహ్వానం అందటం, దానికి కళ్యాణ్‌రామ్ కూడా హాజరుకావడంతో ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్‌రామ్ తీరు పట్ల మనస్తాపం చెందాడని వార్తలు వచ్చాయి. ఇక 'ఎమ్మెల్యే' సినిమా సమయంలో ఎన్టీఆర్ దాని ప్రమోషన్స్‌కి రాలేదనే సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మద్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.
మరోపక్క 'మహానటి' వేడుకకు చీఫ్‌గెస్ట్‌గా హాజరైన ఎన్టీఆర్ 'నానువ్వే' వేడుకకు కూడా రాకపోవడంతో ఈ వార్తలు మరింత బలంగా వినిపించాయి. కానీ ఇది నిజం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ వేడుక సమయంలోనే తన తండ్రి హరికృష్ణకి దగ్గరి బంధువైన వైజాగ్ దేవి సీ ఫుడ్స్ అధినేత ఇంట్లో వివాహం ఉండటంతో హరికృష్ణ తాను వెళ్లకుండా ఎన్టీఆర్‌ని పంపించాడట. లేకపోతే ఎన్టీఆర్ ఈ వేడుకకు రావాలనే భావించాడని, త్వరలో జరిగే 'నా నువ్వే' ప్రమోషన్స్‌లోఎన్టీఆర్ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది.