Advertisement
Google Ads BL

చరణ్‌, ఎన్టీఆర్‌ల బంధం బలపడుతోంది!


నేటి యంగ్‌స్టార్స్‌ ఒకరి చిత్రాలను మరొకరు మెచ్చుకుంటూ, ఒకరి వేడుకలకు మరొకరు హాజరవుతూ, వెకేషన్స్‌లో కూడా కలిసి కనిపించే సంస్కృతిని తెచ్చినందుకు వారికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. చిరంజీవి, బాలయ్య మధ్య మంచి స్నేహం ఉన్నా వారిద్దరు కలిసి ఓకే చిత్రంలో కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 'బాద్‌షా' ఓపెనింగ్‌కి రామ్‌చరణ్‌ హాజరై ఎన్టీఆర్‌తో కలిసి ఇద్దరు ఒకే కారులో వెళ్లిపోయారు. ఇక 'భరత్‌ అనే నేను' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ అతిధిగా వచ్చాడు. ఆ తర్వాత 'రంగస్థలం' నిర్మాతలు ఇచ్చిన పార్టీలో మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌లు కలిసి ఫోటోలు తీసుకున్నారు. 'రంగస్థలం' మీద ఎన్టీఆర్‌, మహేష్‌లు ప్రశంసలు కురిపించగా, 'భరత్‌ అనే నేను' చూసి మిగిలిన స్టార్స్‌ మహేష్‌పై అభినందనల వెల్లువ కురిపించారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఎన్టీఆర్‌-లక్ష్మీప్రణతి మేరేజ్‌డే సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యామిలీలు సైతం కలిశాయి. ఎన్టీఆర్‌ ఎంతో చనువుగా చరణ్‌ భుజం మీద చేయి వేయగా, ఉపాసన ఒడిలో యంగ్‌టైగర్‌ కుమారుడు అభయ్‌రామ్‌ కూర్చున్నాడు. ఇక ఉపాసన, లక్ష్మీప్రణతి ముఖాలు కూడా ఆనందంతో మెరిసిపోతున్నాయి. ఇక ఈ బాండింగ్‌ ఇంతలా ఉన్న సందర్భంగా కేవలం ఓ ఫోటోనే అభిమానులను ఇంతగా ఆకర్షిస్తుంటే బాలయ్య, చిరంజీవిలు చేయలేని పనిని రాజమౌళి ద్వారా ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌లు ఒకటి చేయనున్నారు. మరి ఈ చిత్రం స్టార్ట్‌ అయి విడుదల అయితే ఇక ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కి చెప్పలేని ఆనందం కలగడం గ్యారంటీ అని చెప్పాలి. 

ఇక ఎన్టీఆర్‌-ప్రణతి వివాహవేడుక సందర్భంగా రామ్‌చరణ్‌ దంపతులు బర్త్‌డే కేకును తామే పక్కన ఉండి కట్‌ చేయించారు. ఈ పోటోలను ఉపాసన పోస్ట్‌ చేసింది. అంతేకాకుండా అభయ్‌రామ్‌ కూడా బుజ్జిబుజ్జిగా 'ఐ వనా ఫాలో ఫాలో యూ' అంటూ తన తండ్రి చిత్రంలోని పాటను పాడుతున్న వీడియోని కూడా ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానులు ఎంతో ఆనందంగా ఈ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు.

Mega, Nandamuri Family Bonding revealed:

<span>Ram Charan, Upasana at Young Tiger NTR Wedding Anniversary</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs