Advertisement
Google Ads BL

'బాహుబలి' ప్రీకెల్వ్‌కి రెడీ!


'బాహుబలి-ది బిగినింగ్‌' చిత్రం చైనాలో ఏమాత్రం ఆడలేదు. అక్కడి ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో అమీర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌'తో పాటు ఇండియాలోయావరేజ్‌ అనిపించుకున్న 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' కూడా అక్కడ మొదటి రోజే 3.5 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇక ఇర్ఫాన్‌ఖాన్‌ హీరోగా కేవలం 5కోట్లతో రూపొందిన 'హిందీమీడియం' కూడా భారీ ఓపెనింగ్స్‌ని తెచ్చుకుంది. కానీ 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' మాత్రం ఆ మాత్రం వసూళ్లు కూడా రాబట్టలేదు. ఇక ఈ చిత్రాన్నిఏకంగా 7వేల థియేటర్లలో విడుదల చేశారు. అయినా కూడా అమీర్‌ఖాన్‌ 'దంగల్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, హిందీ మీడియం, భజరంగీ భాయిజాన్‌' వంటి చిత్రాలే చైనాలో చరిత్ర సృష్టిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

మరోవైపు 'బాహుబలి' వంటి గ్రాఫిక్స్‌, పీరియాడికల్‌ డ్రామాలు మాత్రం అక్కడ జనాలకు చూసి చూసి బోర్‌కొట్టింది. ఇలాంటి చిత్రాలు వారెప్పుడో తీశారు. ఎప్పుడో విడుదల అయ్యాయి. కాబట్టి ఇలాంటి చిత్రాల కంటే ఎమోషనల్‌ కంటెంట్‌ ఉన్నచిత్రాలే చైనాలో బాగా ఆడుతున్నాయి. ఇక 'బాహుబలి' విషయానికి వస్తే ఈ చిత్రం ప్రీక్వెల్‌ని తీయనున్నట్లు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభుయార్లగడ్డ తెలిపారు. ఆయన మరో నిర్మాత దేవినేని ప్రసాద్‌తో కలిసి అంతా కొత్తవారితో 'బాహుబలి' ప్రీక్వెల్‌ని ఆన్‌లైన్‌ సిరీస్‌గా తీయనున్నామని ప్రకటించాడు. 

దీనిలో శివగామి చిన్నతనం, మాహీష్మతి కోడలు కావడం, కట్టప్ప ఎక్కడి వాడు? అతను ఆ రాజ్యానికి ఎందుకు బానిస అయ్యాడు? వంటి విశేషాలు ఈ 'బాహుబలి' ప్రీక్వెల్‌లో ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే రచయిత ఆనంద్‌ నీలకంఠన్‌ 'ది రైజ్‌ఆఫ్‌ శివగామి' అనే నవల రాశాడు. దీని ఆధారంగానే ఈ ప్రీక్వెల్‌ రూపొందనుంది. ఇక ఆల్‌రెడీ రామోజీ ఫిలింసిటీలో ఉన్న మాహిష్మతి రాజ్యం సెట్‌తో పాటు ఈప్రీక్వెల్‌కి మరిన్నిసెట్స్‌ వేస్తామని నిర్మాతలు అంటున్నారు. మరి ఇలా ప్రీక్వెల్‌ ప్రయోగం ఇప్పటి వరకు తెలుగులో పెద్దగా రాలేదు. దాంతో 'బాహుబలి' ప్రీక్వెల్‌ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సివుంది...! ఇక ఈ ప్రీక్వెల్‌ తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందనుంది.

Shobu Yarlagadda Officially Announces on Bahubali Prequel:

Shobu Yarlagadda On Baahubali Prequel 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs