Advertisement
Google Ads BL

'మహానటి' సినిమాపై ఈ రూమర్ నిజమేనా?


నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ ల నిర్మాణంలో తెరకెక్కిన మహానటి మూవీ మరొక్క రోజులోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను నటి కీర్తి సురేష్ పోషించింది. అలాగే సమంత మధురవాణి గా సమంత, అలాగే జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఇంకా మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, క్రిష్, నాగ చైతన్య, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ అవసరాల వంటి నటీనటులు నటిస్తున్నారు. ఇకపోతే నట జీవితంలోను, నిజ జీవితంలోను సావిత్రి పడిన కష్ట సుఖాలు అన్ని ఈ సినిమాలో ఎలా చూపిస్తారో అనే ఆసక్తి తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఉంది.

Advertisement
CJ Advs

అయితే మహానటి సినిమాలో సావిత్రి కి సంబందించిన కాంట్రవర్సీలను ఏ మాత్రం టచ్ చెయ్యకుండా ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడని.. సావిత్రి నట జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించి... ఆమె అవసాన దశలో పడిన కష్టాలను నాగ్ అశ్విన్ టచ్ చెయ్యకపోవడం వలెనే సావిత్రి కుటుంబ సభ్యులు సావిత్రి సినిమా మహానటి గురించిన అబ్జెక్షన్స్ పెట్టలేదని ఫిలింసర్కిల్స్ వినబడుతున్న టాక్. మరి బయో పిక్ అంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగిన కష్ట, నష్టాలూ, సుఖ దుఃఖాలను అన్ని చూపించాలి. మరి నాగ్ అశ్విన్ సినిమాపై ఎలాంటి కాంట్రవర్సీలను నెత్తిన ఎత్తుకోవడానికి సిద్ధంగా లేకనే సావిత్రి జీవితంలో చివరిలో పడిన కష్టాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పేందుకు సిద్ధపడలేదని తెలుస్తుంది.

కేవలం సావిత్రి నట జీవితంలో జరిగిన సంఘటనలను మాత్రమే మహానటిగా తెరకెక్కించి ప్రజలముందుకు వస్తున్నట్టుగా సమాచారం. మరి కేవలం సావిత్రి సుఖాలను మాత్రమే వెండితెరమీద చూపించి ఆమె పడిన కష్టాలను దాచేస్తున్నారా? అలాగే సావిత్రి ప్రేమ, సీక్రెట్ పెళ్లిని కూడా దాచేసారా? లేదంటే వాటిని చూపిస్తారా? ఏదిఏమైనా మహానటి సినిమాపై ఇంతవరకు ఎటువంటి కాంట్రవర్సీ బయటికి రాలేదంటే నాగ్ అశ్విన్ ఈ మహానటి ని చాలా పకడ్బందీగా తెరకెక్కించాడని మాత్రం అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రం మే 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Big Rumour on Mahanati Movie:

Mahanati Savitri Biopic movie Mahanati Release on May 9th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs