Advertisement
Google Ads BL

రాజశేఖర్‌, జీవిత లకు రోజా వత్తాసు..!


రాజశేఖర్‌, జీవిత విషయంలో ఏది నిజమో తెలియదు గానీ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరిపై పలు విమర్శలు ఉన్నాయి. ఇదే విషయాన్ని సామాజిక ఉద్యమకారిణి సంధ్య కూడా చెప్పింది. నిజంగా సంధ్య చెప్పిన వార్తలో ఇండస్ట్రీలో కూడా ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక నిన్నటి దాకా వైసీపీకి తనను తాను ఫైర్‌ బ్రాండ్‌గా చెప్పుకునే మాజీ హీరోయిన్‌, నగరి ఎమ్మెల్యే రోజా పవన్‌కి టిడిపికి చెడిందని తెలిసిన వెంటనే పవన్‌ని చాలా సాఫ్ట్‌గా వెనుకేసుకొచ్చింది. అంతేకాదు.. ఆయన అన్నయ్య చిరంజీవిని తాను రాజకీయాలకు పనికి రాడని విమర్శించానని, నాడు ఆ వ్యాఖ్యలు చూసి చిరు కూడా బాధ పడి ఉంటాడని తెలిపి, పవన్‌ అధిరాకంలోకి రాకపోయినా రాజకీయంగా ప్రభావం చూపిస్తాడని చెప్పింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె ఇప్పుడు రాజశేఖర్‌ -జీవితలను కూడా సాఫ్ట్‌కార్న్‌ని చూపిస్తోంది. ఇకవైపు జీవిత, రాజశేఖర్‌ దంపతులు కొంతకాలం వైసీపీలో ఉండి. ఈ మద్య టిడిపి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో రోజా వారిపై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజశేఖర్‌, జీవిత విషయంలో వచ్చిన ఆరోపణలపై రోజా మాట్లాడుతూ, ఏదైనా ఉంటే వెంటనే బయటపడుతుంది. లేదంటే ఒకటి రెండేళ్లలో బయటికి వస్తుంది. కానీ రాజశేఖర్‌ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఆయన గురించి ఇలా బయట ఆరోపణలు రావడం సరికాదు.

నేను కూడా ఆయనతో రెండు చిత్రాలలో నటించాను. ఆయన జీవిత లేకుండా బయటికి కూడా వెళ్లరు. ఇప్పుడు తన కూతుర్లు లేకుండా కూడా ఆయన బయటికి పోవడం లేదు. ఇలాంటి వ్యక్తి ఇలా చేశాడంటే ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు. వేరే ఉద్దేశ్యంతోనే ఆయనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా ఆయన సెల్వమణికి కూడా ఆయన చాలా క్లోజ్‌. ఆయనపై కావాలనే బురద చల్లారనిపిస్తోతంది.. అంటూ వ్యాఖ్యలు చేసింది..! 

Roja Supports Jeevitha and Rajasekhar:

Roja About Rajasekhar Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs