కీర్తి సురేష్ కి అజ్ఞాతవాసి ఎంత పెద్ద డిజాస్టర్ ఇచ్చిందో వేరే చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో కీర్తి లుక్స్ కి అందరూ చిరాకు పడ్డారు. బాగా బరువు పెరిగి ఓవర్ మేకప్ తో కీర్తి సురేష్ చిరాగ్గా ఉందనే కామెంట్స్ పడ్డాయి. అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో మహానటి సినిమాలో నటించింది. అచ్చం సావిత్రి పోలికలతో కీర్తి సురేష్ మహానటి లుక్ అదరగొట్టేస్తుంది. మహానటి ప్రమోషన్స్ లో భాగంగా రోజుకో మహానటి కీర్తి సురేష్ పోస్టర్స్ ని చిత్ర బృందం విడుదల చేస్తుంది. ఆ పిక్స్ లో కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలా ఉందని... సావిత్రి జిరాక్స్ అంటూ అందరూ కీర్తి సురేష్ సావిత్రి లుక్ ని పొగిడేస్తున్నారు.
మరి మహానటి తరవాత కీర్తి సురేష్ కి తెలుగులో మరో అవకాశం లేదు. మరి మహానటి సినిమా విడుదలయ్యాక సావిత్రి కేరెక్టర్ లో కీర్తి సురేష్ నటన చూసిన దర్శక నిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ చాలానే ఉంది. అసలు ఇప్పటికే కీర్తి సురేష్ సావిత్రి లుక్ చూసిన చాలామంది దర్శకనిర్మాతలతో పాటుగా కొంతమంది హీరోలు కూడా కీర్తి వైపు చూడడం మొదలెట్టేశారనే టాక్ వినబడుతుంది. మరి మహానటి మూవీ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే టైం ఉంది. వచ్చే బుధవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహానటి సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
మరి మహానటి తో కీర్తి సురేష్ హవా మళ్ళీ టాలీవుడ్ లో మొదలైన మొదలవ్వొచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చూద్దాం కీర్తి సురేష్ కి మహానటి సినిమా ఎంతవరకు కలిసొస్తుందో. ఇంకా ఈ సినిమాలో కీర్తి తో పాటుగా భారీ స్టార్ కాస్ట్ కూడా భాగమైంది.