Advertisement
Google Ads BL

'మహానటి' కి మెగాస్టార్ సెంటిమెంట్‌!


ప్రతి ఒక్కరికి సెంటిమెంట్స్‌ ఉన్నా కూడా సినిమా వారికి ఈ సెంటిమెంట్స్‌ మరి ఎక్కువ. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తిసురేష్‌ నాటి సావిత్రి బయోపిక్‌లో 'మహానటి'గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్ననాగ్‌అశ్విన్‌ ఈచిత్రాన్నితీయడం అంటే అది మామూలు విషయం కాదు. సావిత్రి జీవితంలోని కొన్ని విషయాలను ఒత్తిడుల కారణంగా చూపించలేని పరిస్థితి, ఇబ్బంది ఉండటంతో ఎవరినీ నొప్పించకుండా ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ ఎలా తీశాడో అని అందరికీ ఉత్కంఠ ఎదురవుతోంది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా వరుస పోస్టర్స్‌ని రిలీజ్‌ చేసి సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. సావిత్రి ఫస్ట్‌స్టిల్‌ని కూడా ఖచ్చితంగా అలాగే ఉండేవిధంగా సావిత్రి ఫస్ట్‌స్టిల్‌ని విడుదల చేశారు.ఈ స్టిల్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక మహానటి జీవితాన్ని వివాదాలకు తావులేకుండా నాగ్‌ అశ్విన్‌ బాగా చేశాడని, దాంతో సెన్సార్‌ కూడా సింగిల్‌కట్‌ లేకుండా చిత్రానికి క్లీన్‌యు ఇవ్వడం విశేషం. ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ వంటి అవకాశం వచ్చినా తేజ వంటివారు న్యాయం చేయలేమో అని వైదొలిగారు. మరి ఈ విషయంలో ఒకే సినిమా అనుభవం ఉన్న నాగ్‌అశ్విన్‌ ప్రయోగాన్ని మనసారా అభినందించాల్సిందే. 

ఇక ఈ చిత్రం మే 9వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇక సినిమాలంటే శుక్రవారం, మరీ లేదంటే గురువారం రిలీజ్‌ చేస్తారు. కానీ 'మహానటి'ని మాత్రం బుధవారం విడుదల చేస్తున్నారు. దీనికి కూడా ఓ సెంటిమెంట్‌ కారణమని తెలుస్తోంది. వైజయంతీ బేనర్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌, బ్లాక్‌బస్టర్‌ అయిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' కూడా మే 9వ తేదీనే విడుదలైంది. ఆ సెంటిమెంట్‌తోనే దీనిని రిలీజ్‌ చేస్తున్నారు. ఇక తమిళంలో మాత్రం మే 11న విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు కామియో పాత్రల్లో చేశారని, ఆ చిత్రం విడుదలై తర్వాత వారిని తెరపై చూడటమే ఆశ్చర్యం కలిగిస్తోందని సమాచారం. 

Mahanati Banks on Chiranjeevi's Industry Hit Sentiment:

<h3 class="text-center">Mahanati on Wednesday Release</h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs