Advertisement
Google Ads BL

ప్రభాస్‌ 'సాహో' ఫొటోస్ లీక్ చేసిందెవరు..!


'బాహుబలి'తో ప్రభాస్‌ నేషనల్‌స్టార్‌గా, నేషనల్‌ ఐకాన్‌గా మారాడు. ఇక విదేశాలలో కూడా ఆయనకు బాగానే గుర్తింపు వచ్చింది. 'బహుబలి-ది బిగినింగ్‌'కి ప్రభాస్‌కి పెద్దగా పేరు రాకపోయినా 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' మాత్రం ఆయన్ను నేషనల్‌ స్టార్‌ని చేసింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆయన నటిస్తున్న 'సాహో' చిత్రం షూటింగ్‌లో ప్రభాస్‌ లేని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఇక తాజాగా దుబాయ్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. యూఎస్‌ నుంచి కార్లను దిగుమతి చేసుకుని దాదాపు 30 నుంచి 40కోట్ల బడ్జెట్‌ని మాత్రం ఈ ఒక్క యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసమే ఖర్చుపెడుతున్నారు. ఇక దుబాయ్‌ ప్రభుత్వం కూడా తమ దేశాలలో చిత్రీకరించే సినిమాలకు లోకేషన్‌లో అనుమతితో పాటు ఆయా నిర్మాణ సంస్థలకు పలు రాయితీలు కూడా ఇస్తుంది. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం యాక్షన్‌ సీన్స్‌ని 'బుర్జ్‌ఖలీఫా' ప్రాంతంలో హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్స్‌తో తీస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో ప్రభాస్‌ సినిమా షూటింగ్‌లో భాగంగా బైక్‌పై ఉన్న ఫొటోలు లీక్‌ అయ్యాయి. వీటి ద్వారా ప్రభాస్‌ లుక్‌ రివీల్‌ అయిందని 'సాహో' టీం బాధలో ఉందని అంటున్నారు. కానీ వీటిని మీడియాకు ఈ చిత్రం యూనిట్టే లీక్‌ చేసి, సినిమాపై అంచనాలు, క్రేజ్‌ తెచ్చేపనిలో ఉందని సమాచారం. తర్వాత ప్రభాస్‌ దుబాయ్‌కి సంబంధించిన మీడియాతో ముచ్చటించాడు. 

ఇక ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. నాదృష్టిలో ప్రభాస్‌ నేషనల్‌ స్టార్‌. ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతాడు. ప్రతి ఒక్కరిని వెంటనే తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. నాకుటుంబ సభ్యులతో ఆయన చనువుగా మెలిగిన తీరు నాకెంతో ఆనందంగా ఉంది.. అంటూ తన భార్య ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్‌, శ్రద్దాకపూర్‌, జాకీష్రాఫ్‌, నీల్‌నితిన్‌ ముఖేష్‌, మందిరాబేడీ, అరుణ్‌విజయ్‌, చుంకీ పాండే వంటి భారీతారాగణం నటిస్తుండగా, శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ అనే బాలీవుడ్‌ మ్యూజిక్‌ త్రయం దీనికి పనిచేస్తోంది. 

Prabhas Sahoo Movie On location Photo Leaked:

<h3 class="text-center"><span style="font-weight: normal;">Neil Nitin Mukesh raves about Prabhas</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs