Advertisement
Google Ads BL

పవన్ కల్యాణే వస్తున్నాడు..!


రవితేజ, కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న'నేల టిక్కెట్‌' చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే తన మొదటి రెండు చిత్రాలైన 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం' వంటి హిట్స్‌ని కొట్టిన కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రం ద్వారా హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకకు పవన్‌ చీఫ్‌ గెస్ట్‌గా వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దానిని కళ్యాణ్‌కృష్ణ, యూనిట్‌ రూమర్ల కింద కొట్టిపడేసింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఈ చిత్ర నిర్మాత రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ.. ఈ చిత్ర ఆడియో ఈవెంట్ కి చీఫ్‌గెస్ట్‌గా పవన్‌ వస్తున్నాడని అఫీషియల్‌గా ప్రకటించాడు. ఈనెల 10వ తేదీన జరిగే ఈ వేడుక ఎక్కడ జరగనుంది? అనేది ప్రకటించనున్నారు. ఇక ఈనెల 24వ తేదీన సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పవన్ ఈమద్య తన బిజీ షెడ్యూల్‌లో కూడా తాను నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన నితిన్‌ చిత్రం 'చల్‌ మోహనరంగ', తన అబ్బాయ్‌ అయిన 'రంగస్థలం' థ్యాంక్స్‌ మీట్‌కి వచ్చాడు. ఈ రెండు చిత్రాలకు పవన్‌కి సంబంధం ఉంది. కానీ రవితేజ చిత్రానికి ఆయన ఎందుకు వస్తున్నాడు? 

నిర్మాత, దర్శకులు ఆహ్వానం మేరకు వస్తున్నాడా? లేక రవితేజ కోరిక మేరకు వస్తున్నాడా? అనేది తెలియాల్సివుంది. ఇక చిరంజీవి తర్వాత తరంలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌లేకుండా పైకి వచ్చిన హీరోగా రవితేజకు పేరుంది. ఆయన ఎదుగుదలకు చిరు కూడా ఎంతో సాయం చేశాడు. మరి పవన్‌తో రవితేజకి స్నేహం ఉందని ఇప్పటి వరకు తెలియదు. ఇది అందరికీ ఆశ్చర్యాన్నికలిగిస్తోంది. 

Pawan Kalyan as Chief Guest for Nela Ticket Audio event:

Power Star Pawan Kalyan to grace the audio launch of Raviteja's 'Nela Ticket'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs