Advertisement
Google Ads BL

ప్రకాష్ రాజ్ చెలరేగిపోతున్నాడుగా..!


నేడు కేంద్రంలోని బిజెపి పాలన ఏరకంగా ఉందంటే సామధాన దండోపాయాలు ఉపయోగించుకుని అయినా ఇతర పార్టీలను, నాయకులను దారిలోకి తెచ్చుకోవాలనే నియంతృత్ర దోరణి కనిపిస్తొంది. తమిళనాట కూడా తమ సత్తా చాటేందుకు పన్నీర్‌, పళని స్వామిలకు స్నేహ హస్తం అందిస్తూ, శశిరేఖ, ఆయన భర్తపై, మేనల్లుడుపై ఐటి దాడుల ద్వారా సంచలనం సృష్టించింది. ఇక మిగిలిన రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే ప్రస్తుతం చంద్రబాబు నుంచి జగన్‌ వరకు అందరు కేంద్రాన్ని విమర్శిస్తే తమపై ఏ కేసులు బనాయించడమో, లేక పాతకేసులను తిరగతోడడమో చేస్తోందనే అనుమానం రాకమానదు. అందుకే ఇటీవల చంద్రబాబు నాయుడు తెలుగువారందరు తన వెన్నంటి ఉండాలని, ఏ ఆపదనలో తాను చిక్కుకున్నా ఆశ్చర్యం లేదని ప్రకటించాడు. 

Advertisement
CJ Advs

ఇక టిడిపితో బంధం తెంచుకున్న తర్వాత జగన్‌ సీఎం కావడం ఖాయమని, ఆయనకేసులు నిలబడవని బిజెపి నాయకులు అంటున్నారు. మరోవైపు కర్ణాటకలో కూడా వీరికి గాలి జనార్ధన్‌రెడ్డితో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. అయితే బిజెపి, మోదీ అనే తేడా లేకుండా పవన్‌, రజనీ, కమల్‌ కంటే వారిపై దుమ్మెత్తిపోస్తున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌. 

ఆయన తాజాగా మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రతాపం ఎంత అనేది ఈనెల 15వ తేదీన బయటపడుతుందని అన్నారు. కర్ణాటక నుంచే మోదీ పతనం ప్రారంభం అవుతుంది. 2019 తర్వాత మన దేశంలో మోడీకి పనేమి ఉండదు. ఆ సమయంలో కర్ణాటక వస్తే తమ వారు ఆయనకు కన్నడ నేర్పిస్తారని ఎద్దేవా చేశాడు. కర్ణాటకలో ప్రచారం చేస్తూ మోదీ చేసిన కన్నడ ప్రచారాన్నిప్రకాష్‌రాజ్‌ ఎద్దేవా చేశాడు. ఈసందర్భంగా మోదీ కర్ణాటకలో చేసిన ప్రసంగాన్నిఆయన అనుకరించి చూపారు. 

కాయగూరలు అమ్మినట్లు ఏమిటండీ ఆ భాష? అంటూ సెటైర్‌ విసిరాడు. మరోవైపు రాహుల్‌ ప్రసంగాలను తప్పుపడుతున్న మోదీని ఉద్దేశించి, రాహుల్‌ వయసెంత? మీ వయసెంత? బుద్ది లేదా? సిగ్గుగా లేదా? అని ప్రశ్నించాడు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని, బిజెపి అంటే తనకేమీ భయం లేదని చెప్పాడు. ఇలా మాట్లాడిన వారిలో శివాజీ, బాలకృష్ణల తర్వాత ఇంతగా బిజెపిపై ఫైర్‌ అయింది ప్రకాష్‌రాజేనని చెప్పాలి!

Prakash Raj Fires on Narendra Modi:

Actor Prakash Raj targets Prime Minister Narendra Modi again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs