Advertisement
Google Ads BL

మహేష్‌ సర్‌ప్రైజ్‌ తో పెళ్లికూతురు హ్యాపీ..!


మహేష్‌ని కెరీర్ పరంగానే కాదు. నిజజీవితంలో కూడా చెప్పాలంటే 'భరత్‌ అనే నేను' ముందు తర్వాత అని విభజించుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆయన మాట తీరు నుంచి కాస్ట్యూమ్స్‌, ఆయన బాడీలాంగ్వేజ్‌ వంటివన్నీ మారాయి. ఇటీవల ఆయన విజయవాడకి వెళ్లి శ్రీకనకదుర్గమ్మని పూజించుకున్న సందర్భంగా తమ అభిమాన హీరోని మరంత దగ్గర నుంచి చూసేందుకు ఓ అభిమాని గట్టిగా మహేష్‌బాబు కాలు తోక్కాడు. అదే ప్లేస్‌లో బాలయ్యో, ఇంకెవరైనా ఉండి ఉంటే ఏమి జరిగేదో అందరికీ తెలుసు. కానీ మహేష్‌ మాత్రం ఆ అభిమానిని సున్నితంగా 'ఎందుకు తొందర.. మేము కూడా మనుషులమే కదా' అని చెప్పి తర్వాత ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా మహేష్‌ బాబుకి పెద్ద లేడీ ఫ్యాన్‌ అయిన సులేఖ పెళ్లి జరిగింది. దీంతో మహేష్‌ 'ప్రేమతో మీ మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌' అని ఇద్దరు సంతకాలు చేసిన ఓ గ్రీటింగ్‌కార్డుని ఆమెకి పంపించాడు. సరిగ్గా పెళ్లిరోజున ఈ గ్రీటింట్‌ కార్డ్‌ని ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు చూపించగా, పెళ్లికూతురు సులేఖ షాక్‌తిన్నది. ఆ గ్రీటింగ్‌కి చూసి ఉబ్బితబ్బిబ్బయింది. ఈ గ్రీటింగ్‌కార్డ్‌ని ఒకరు ఫొటో తీయగా, ఈ విషయాన్నిఓ టాబ్లాయిడ్‌ ప్రచురించింది. 

ఇలా ఈరెండు సంఘటలను చూస్తే మహేష్‌ పూర్తిగా సిగ్గరి నుంచి క్రమంగా తనఫ్యాన్స్‌ విషయంలో ఎంతో సానుకూలంగా ఉంటూ అందరి చేత సెహభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం పారిస్‌లో తన కుటుంబ సభ్యులతో ఉన్నమహేష్‌బాబు త్వరలో తన 25వ చిత్రం, వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్‌ల బేనర్‌లో నటించే చిత్రంకోసం న్యూయార్క్‌కి వెళ్లనున్నాడు. 

Mahesh Babu female fan marriage photos create sensation:

Her Wedding Snaps, Mahesh Makes Go Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs