Advertisement
Google Ads BL

అఖిల్ 3కి హీరోయిన్ సెట్ అయినట్లేనా?


అఖిల్ సినిమాలో సాయేషా సైగల్ తో కలిసి నటించిన అక్కినేని అఖిల్, హలో సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తో కలిసి నటించాడు. తాను నటించిన రెండు సినిమాల్లోనూ కొత్త భామలతో జోడి కట్టిన అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరితో కలిసి చేస్తున్న అఖిల్3  కోసం మరో కొత్త భామను తీసుకొస్తున్నాడనే ప్రచారంతో పాటు... నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ నటిస్తుందని ప్రచారం జోరుగా జరిగింది. కానీ మేఘ ఆకాష్ కి వరుసగా రెండు ప్లాప్స్ పడడంతో ఆమెను పక్కకి తప్పించారు. అయితే ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిమీద సస్పెన్సు వీడినట్లుగానే అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

అఖిల్3 లో అఖిల్ సరసన నాగ చైతన్య సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్ ని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న నిధి అగర్వాల్.. అఖిల్ సరసన గనక ఓకె అయితే.. వరుసగా అన్నదమ్ముల సినిమాల్లో నటించి రికార్డు కొట్టేసినట్లే. ఇప్పటికే అఖిల్ సినిమా కోసం వెంకీ అట్లూరి.. నిధి అగర్వాల్ ని ట్రయల్ ఫోటో షూట్ కోసం పిలిపించి ఫోటో స్టిల్స్ తీసుకోగా.... అఖిల్‌ పక్కన నిధి పర్ఫెక్ట్ సూట్ అవుతుందన్న అభిప్రాయానికి దర్శకుడు హీరో, నిర్మాతలు వచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకే అఖిల్ పక్కన దాదాపుగా నిధినే ఫిక్స్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే నిధి అగర్వాల్ నటిస్తున్న సవ్యసాచి షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక అమ్మడు అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంది. అందుకేనేమో అఖిల్ కూడా నిధి అగర్వాల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఫైనల్ గా అఖిల్ పక్కన కూడా నిధికి చోటు దక్కితే గనక అమ్మడుకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.

Nidhi Agarwal Heroine in Akhil 3rd film:

Naga Chaitanya Heroine for Akhil 3rd Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs