Advertisement
Google Ads BL

మరోసారి చరణ్ కోసం బాబాయ్ వస్తున్నాడు!


హీరో శ్రీకాంత్‌ 100చిత్రాలను పైగా చేసి ఇప్పటికీ విడుదల కాని సినిమాలలో హీరోవేషాలు, విడుదలయ్యే చిత్రాలలో ఇంపార్టెంట్‌ పాత్రలను చేస్తున్నాడు. ఇక శ్రీకాంత్‌ ప్రస్తుతం కీలకమైన పాత్రలు, సపోర్టింగ్‌ రోల్స్‌ని కూడా పోషిస్తున్నాడు. శ్రీకాంత్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన 'శంకర్‌దాదాఎంబిబిఎస్‌,శంకర్‌దాదా జిందాబాద్‌' చిత్రాలలో కీలకమైన పాత్రలు చేశాడు. ఇక ఈయన చిరంజీవిని అన్నయ్య అని పిలుస్తాడు. శ్రీకాంత్‌, ఊహ పెళ్లికి కూడా పెద్ద దిక్కుగా చిరంజీవినే నిలిచాడు. 

Advertisement
CJ Advs

ఇక బోయపాటి శ్రీను విషయానికి వస్తే ఈయన పవర్‌ఫుల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పవచ్చు. బోయపాటి అల్లుఅర్జున్‌తో చేసిన 'సరైనోడు' చిత్రంలో బన్నీకి బాబాయ్‌గా శ్రీకాంత్‌ నటించాడు. ఇక రామ్‌చరణ్‌, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే'లో అదే తరహాలో బాబాయ్‌ పాత్రని చేశాడు. ఇక తాజాగా బోయపాటి శ్రీను రామ్‌చరణ్‌ హీరోగా దానయ్య నిర్మాణంలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో 'భరత్‌ అనే నేను' హీరోయిన్‌ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆల్‌రెడీ వివేక్‌ ఓబేరాయ్‌ వంటి పవర్‌ఫుల్‌ విలన్‌తోపాటు తమిళ హీరో ప్రశాంత్‌, నవీన్‌చంద్ర, స్నేహ వంటి వారు కీలక పాత్రలను చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ కూడా ఇంపార్టెంట్‌ రోల్‌ని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

తాజా సమాచారం ప్రకారం బోయపాటి- చరణ్‌ చిత్రంలో ఓ కీలకమైన రోల్‌ ఉందిట. ఈ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలా? అని బోయపాటి ఆలోచిస్తుండగా, ఆ పాత్రను శ్రీకాంత్‌ చేత చేయిస్తే బాగుంటుందని రామ్‌చరణ్‌ చెప్పడంతో ఇందులో శ్రీకాంత్‌ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. మరి ఈ పాత్ర కిచ్చా సుదీప్‌ కోసం అనుకున్న పాత్రా? లేక ఇందులో కిచ్చాసుదీప్‌తో పాటు శ్రీకాంత్‌ కూడా నటిస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని రామ్‌చరణ్‌ లేకుండానే పూర్తి చేసిన బోయపాటి తాజాగా రామ్‌చరణ్‌కూడా షూటింగ్‌లో జాయిన్‌ కావడంతో రెండో షెడ్యూల్‌ని వేగంగా పూర్తి చేస్తున్నాడు. 

Ram Charan and Srikanth's Combo Again!:

<span>Ram Charan and Srikanth to Team up fo Boyapati</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs