Advertisement
Google Ads BL

పూజ హెగ్డే కి ఈ హీరోతోనే ప్రాబ్లమ్..!


ఇప్పటివరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న పూజ హెగ్డే ఒక్కసారిగా బిజీ తారగా మారిపోయింది. ముకుందా, ఒకలైలా కోసం, మోహింజదారో, దువ్వాడ జగన్నాథం సినిమాలను చాలా ఆరామ్స్ గా చేసిన పూజ హెగ్డే.. ప్రస్తుతం సాక్ష్యం సినిమాలో నటిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకుంది. అయితే పూజాహెగ్డే కి డీజే సినిమా తర్వాత అదృష్టం బాగా కలిసొచ్చింది. డీజే లోని బికినీ షోతో అమ్మడు హాట్ హాట్ గా అవకాశాలు కొట్టేసింది. ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది. 

Advertisement
CJ Advs

అందులో ఒకటి అప్పుడే సెట్స్ మీదకెళ్ళిపోయింది కూడా. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదుంది. అలాగే మహేష్ - వంశి పైడిపల్లిల సినిమా కూడా జూన్ నుండే సెట్స్ మీదకెళ్లనుంది. ఈ సినిమాలో కూడా పూజ హెగ్డే నే హీరోయిన్. అలాగే ప్రభాస్ - రాధాకృష్ణ ల సినిమా కూడా జూన్, జులై లలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఒకేసారి మూడు సినిమాలకు డేట్స్ కేటాయించడం కష్టం కాకపోయినా... అమ్మడు మాత్రం ఈ మూడు స్టార్ హీరోల సినిమాల్లో ఫుల్ గా అలసిపోవడం ఖాయంగానే కనబడుతుంది. ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ దిగడం అన్నట్టుగా ఉంటుంది ఇక అమ్మడు వ్యవహారం.

అలాగే ఎన్టీఆర్ పక్కన డాన్స్ అదరగొట్టేయ్యాలి. ఎన్టీఆర్ పక్కన డాన్స్ లో ఏ మాత్రం తేడా వచ్చిన పూజా హెగ్డే తేలిపోవడం ఖాయం. కానీ మహేష్, ప్రభాస్ సినిమాలకు ఎక్కువగా పూజ డాన్స్ ల విషయంలో భయపడే పనిలేదు. ఎందుకంటే వారి పక్కన డాన్స్ చెయ్యడం అంటే పెద్ద విషయమే కాదు. ఆ ఇద్దరు హీరోలు డాన్స్ లలో అదరగొట్టే టాలెంట్ లేకపోవడం పూజ కి కలిసొచ్చే అంశం. కానీ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో మాత్రం పూజ బాగా కష్టపడాల్సి ఉంటుంది. మరి ఇలా పూజ హెగ్డే ఏకకాలంలో ముగ్గురు హీరోలతో రొమాన్స్ చేస్తూ మామూలు బిజీ కాదు పిచ్చ బిజీ తారగా మారిపోయింది. 

Pooja Hegde signs NTR, Mahesh and Prabhas Films:

Pooja Hegde, Tollywood Sensational Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs