Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ వి కాస్ట్లీ హాబీలు!


ఒక్కొక్కరికి వారి అలవాట్లు, హాబీలు వారి ఆర్ధిక స్థోమతను బట్టి ఉంటాయి. మనం సెలవు దొరికితే పక్కనే ఉన్న ఊరిలోని దేవాలయాలకు కూడా వెళ్లే స్థోమత ఉండదు.ఇక క్రికెట్‌, ఇతర ఆటలను టివీ చానెల్స్‌లో తప్ప నిజంగా చూసే స్థోమత కూడా ఉండదు. ఇక ఎండాకాలం అయినా కూడా ఏసీలు కాదు కదా.. ఫ్యాన్లు లేని వారు ఎందరో ఉంటారు. అలా ప్రతి ఒక్కరి హాబీ, వ్యాపకాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌లు అనేది ఆయా వ్యక్తుల ఆర్దికస్థోమతని బట్టి ఉంటాయి. 

Advertisement
CJ Advs

ఇక సినిమా వారి హాబీలు ఎంతో కాస్ట్లీగా ఉంటాయి. వారు వెకేషన్స్‌ పేరుతో ఫ్యామిలీలతో సహా విదేశాలు చుట్టి వస్తారు. ఎండాకాలం నుంచి తప్పించుకోవడానికి చల్లని ప్రదేశాలకు వెళ్తుంటారు. కాస్త జలుబు చేసినా విదేశాలలోని డాక్టర్ల వద్దకు పరుగెడుతూ ఉంటారు. ఇక పరిణితి చోప్రా విషయానికి వస్తే ఈమెకి హాలీడేస్‌ వచ్చాయంటే తనకిష్టమైన దేశంలో వాలిపోతుంది. డైవింగ్‌ లైఫ్‌ని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తుంది. ఇప్పటికే ఆమె స్కూబా డైవింగ్‌లో సర్టిఫికేట్‌ తెచ్చుకుంది. కిందటి ఏడాది మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసింది. ఈ ఏడాది ఆమె ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఉంది. గ్రేట్‌ బారియర్‌ రిఫ్‌లో డైవింగ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌చేస్తోంది. 

దీంతో ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె చెబుతూ, తన ప్రొఫెషనల్‌ లైఫ్‌లో కూడా బిజీగా ఉన్నానని తెలియజేసింది. అర్జున్‌కపూర్‌ హీరోగా రూపొందుతున్న 'సందీప్‌ ఔర్‌ పింకీ పరార్‌, నమస్తే ఇంగ్లాండ్' వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయి. ఇక ఈమె అక్షయ్‌ కుమార్‌ హీరోగా రూపొందుతున్న 'కేసరి' చిత్రంలో కూడా నటిస్తోంది. మరి ఈ చిత్రాలు ఆమెకి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచిచూడాల్సివుంది...! 

Parineeti Chopra enjoys scuba diving in the Great Barrier Reef:

Bollywood Heroine Costly Life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs