Advertisement
Google Ads BL

సూర్యకు పోటీగా హోలీ ఫైట్..!


'భరత్‌ అనే నేను' కలెక్షన్లు స్టడీగానే ఉన్నా కూడా ఈ చిత్రం 200కోట్ల మార్కును దాటుతుందా? రంగస్థలంని మించిన వసూళ్లను సాధిస్దుందా? లేదా? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఎందుకంటే మరో రెండు రోజులో అల్లుఅర్జున్‌ 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' అంటూ వస్తున్నాడు. ఇక 'ఎవేంజర్స్‌' దెబ్బ కూడా కాస్త భరత్‌ని తాకిందనే చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో భరత్‌ అనే నేను స్టడీగా సాగాలంటే మరింత స్పెషల్‌ కేర్‌ అవసరం. అది ఉంటేనే బన్నీని ఎదుర్కొని 200కోట్లకు చేరుకోగలడు. 

Advertisement
CJ Advs

ఇక కొరటాల శివ చిత్రాలైన 'మిర్చి'లో రెయిన్‌ ఫైట్‌ని కొంతకాలం తర్వాత యాడ్‌ చేశారు. ఇక 'శ్రీమంతుడు'లో కూడా ఇదే స్ట్రాటర్జీని కొరటాల ఫాలో అయ్యాడు. ఇక ఈ చిత్రం మొదటి ప్రెస్‌మీట్‌లోనే కొరటాలశివ, మహేష్‌బాబులు ఈచిత్రంలో ఓ హోళీ ఫైట్‌ ఉందని,కానీ కొన్నికారణాల వల్ల పక్కన పెట్టామని, సినిమా రన్‌లో భాగంగా దీనిని త్వరలో యాడ్‌ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ హోళీ ఫైట్‌ కలపడానికి కూడా ముహూర్తం సిద్దం అయిపోతోంది. 

'నాపేరు సూర్య' వచ్చిన రోజునే అంటే మే 4వ తేదీ నుంచే 'భరత్‌ అనే నేను'లో మహేష్‌ హోళీ ఫైట్‌ని యాడ్‌ చేయనున్నారు. దీనివల్ల 'నా పేరు సూర్య'ని కూడా తట్టుకుని మరో వారం, రెండు వారాలు తమ చిత్రం స్టడీగా సాగేలా ఇది ఉపయోగపడుతుందని యూనిట్‌ భావిస్తోంది. అయితే ఆల్‌రెడీ ఈ చిత్రాన్ని చూసిన వారు కేవలం ఈ ఫైట్‌ కోసమే రెండో సారి వస్తారా? లేదా? అనేది అనుమానమే అయినప్పటికీ మహేష్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు రెడీ అవుతున్నారని చెప్పవచ్చు.

Naa Peru Surya vs BAN Holi Fight:

War between Mahesh babu and Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs