తనకోపమే తనకు శత్రువు... తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఊరకే అనలేదు. అసలు శ్రీరెడ్డి ఇష్యూలో ఈమె మొదట ఫొటోలతో సహా లీక్ చేసి తనని మోసం చేశాడని ఆరోపించింది సురేష్‌బాబు తనయుడు అభిరాం మీద. కానీ సురేష్‌బాబు దీనిపై అసలు స్పందించలేదు. దాంతో అసలు వ్యవహారం అభిరాం నుంచి పవన్ కల్యాణ్‌వైపు టర్న్ తీసుకుంది. పవన్ ఆయన ఫ్యామిలీ కూడా దీనిని పట్టించుకోకుండా ఉండి ఉంటే సమస్య అక్కడితే ముగిసిపోయేది. లేదా మరో మలుపు తిరిగేది. కానీ ఈ విషయంలో మెగా ఫ్యామిలీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. సురేష్‌బాబుకి ఉన్న ముందు చూపు కూడా మెగా ఫ్యామిలీకి లేకుండా పోయింది.
ఇక నాగబాబు, అల్లుఅరవింద్‌లు ఘాటు వ్యాఖ్యలతో సమస్య బురదను తమమీద తామే పూసుకున్నారు. అయినా అప్పటివరకు ఏమీ మాట్లాడని, ఇండస్ట్రీకి మద్దతు ఇస్తూ, మేమంతా ఒక్కటే, శ్రీరెడ్డిది తప్పు అని మాట్లాడకుండా మౌనం వహించిన మెగా ఫ్యామిలీ తన వరకు వచ్చేసరికే అలా స్పందించిందని విమర్శలు వచ్చాయి. ఇక పవన్ ఆవేశం ఏమిటో అందరికీ తెలుసు. తన తుపాకిని నాడు పోలీసులకు హ్యాండోవర్ చేసినప్పుడు, దక్కన్ క్రానికల్ విలేకరిపై ఉదయ్‌కిరణ్‌తో తన అన్నయ్య పెద్ద కూతురు ఎంగేజ్‌మెంట్ సమయంలో చేయి చేసుకోవడం, తర్వాత దక్కన్ క్రానికల్ ఎదుట ధర్నా చేసినప్పుడు. కామ్‌న్‌మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పినప్పుడు ఈయన క్రమంగా మీడియాను వ్యతిరేకిని చేసుకున్నాడు. ఇది ఆయన భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. అందునా ఆయన ఇప్పుడు ఓ పొలిటీషయన్.
ఇక దీనిపై నాగబాబు స్పందిస్తూ ముందుగా తాము స్పందించలేకపోవడానికి మా అసోసియేషన్ ఈ విషయాన్ని డీల్ చేసేటప్పుడు తాము ఎంటర్ కాకూడదనేది మాత్రమే కారణమని చెప్పాడు. మరి పవన్ విషయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విషయాన్ని 'మా'కే ఎందుకు వదిలేయలేదు? ఇక తాను పీఆర్పీ తరహాలో తన తమ్ముడు జనసేన వెంట ఉంటానా? ఎన్నికల్లో నిల్చుంటానా? ప్రచారం చేస్తానా? అనేది కూడా క్లారిటీ లేదని, అవి మాట్లాడటం తొందరపాటు తనం అవుతుందని అన్నాడు. ఇక లక్షల్లో ఉండే అభిమానులను తాము కంట్రోల్ చేయలేమని, నేటి రోజుల్లో ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌పోన్ ఉందని, సోషల్‌మీడియాలో వారు ఏమైనా స్పందిస్తే దానికి తాము బాధ్యత ఎలా తీసుకుంటామన్నాడు. మరి మీడియా కూడా నేడు విస్తృతం అయింది. మరి దేనిలోఒక దానిలోఇలా వస్తే దానికి మీడియానంతా తప్పుపట్టడం సరైనపద్దతేనా?.