మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత తన బాబాయ్ నాగబాబు నిర్మాతగా... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరంజ్ సినిమా చేసాడు. రామ్ చరణ్ కి ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాతో అప్పుడప్పుడు సినిమాలు నిర్మిస్తున్న నాగబాబు ఒక్కసారిగా ఆర్ధికంగా కుదేలైపోయాడు. ఆతర్వాత మళ్ళీ సినిమాని నిర్మించే ఆలోచన చెయ్యలేదంటేనే నాగబాబు ఆరంజ్ సినిమాతో ఎంతగా బాధ పడ్డాడో అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు నాగబాబు అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాని లగడపాటి శ్రీధర్ తో కలిసి నిర్మించడమే కాదు సమర్పిస్తున్నాడు కూడా. ప్రస్తుతం నా పేరు సూర్య ప్రమోషన్స్ లో ఉన్న నాగబాబు తన ఆరంజ్ సినిమా డిజాస్టర్ గురించి కూడా మాట్లాడాడు.
తన అన్న కొడుకు రామ్ చరణ్ కి మంచి హిట్ ఇవ్వలేకపోయానని చెబుతున్నాడు. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ వెంటనే మరో పెద్ద హిట్ ఇవ్వాలని ఆరంజ్ సినిమా చేశానని.. కానీ ఆ సినిమా ప్లాప్ అవడంతో తానెంతగా బాధ పడ్డాడో అనే విషయాన్నీ చెబుతున్నాడు. రామ్ చరణ్ కి హిట్ ఇవ్వలేకపోవడంతో తాను ఇక నిర్మాతగా పనికి రాననుకుని మళ్ళీ మరో సినిమాని నిర్మాతగా మొదలు పెట్టలేదని చెబుతున్నాడు. ఇక ఆ సినిమా దెబ్బకి సీరియల్స్ లో నటించడం, కొన్ని షోస్ కి జడ్జి గా చేయడం చేశానని చెబుతున్నాడు నాగబాబు.
కానీ అప్పట్లో వచ్చి డిజాస్టర్ అయిన ఆరంజ్ సినిమా గనక ఇప్పుడొచ్చి ఉంటె మాత్రం సూపర్ హిట్ అయ్యేదని చెబుతున్నాడు నాగబాబు. మరి ఇప్పుడు నాగబాబు నా పేరు సూర్య తో నిర్మాతగా హిట్ అందుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. చూద్దాం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నా పేరు సూర్య ఎలా ఉండబోతుందో అనేది.