నటి ప్రియాంకాచోప్రా కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. క్వాంటికో సిరీస్‌తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. దాంతో ఆమె బాలీవుడ్ చిత్రాలను బాగా తగ్గించేసింది. ఇక ఈమె విదేశాలలో ఓ విలాసవంతమైన భవంతిని కట్టుకుని తన తల్లితో పాటు ఉంటోంది. ఇక ఈమె చాలా అరుదుగా మాత్రమే ఇండియా వస్తోంది. పలు బ్రాండ్ అంబాసిడింగ్ పనులతో పాటు అస్సోం రాష్ట్ర టూరిజం ప్రచారకర్తగా ఆమె వ్యవహరిస్తోంది. కాగా కొంతకాలం నుంచి ఆమెపై ఓ వార్త వస్తోంది. ఆమెకి రహస్యంగా పెళ్లి జరిగిందని, విదేశాలలోనే ఆమె పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతోందని ఒక టాక్. దీనికి కారణం కేవలం ఓ బ్రాస్‌లెట్ కావడం విశేషం.
ఏదైనా మంగళసూత్రాలు, మెట్టెలు వంటివి చూస్తే పెళ్లయింది అనే వార్తలు వస్తాయి గానీ కేవలం ఓ బ్రాస్‌లెట్‌ని చూసి ఇలాంటి వార్తలు రావడానికి కూడా ఓ కారణం ఉంది. ఆమె బ్రాస్‌లెట్ అచ్చు మంగళసూత్రంగా, పూసలతో ఉంది. దాంతో ఈ పుకారు వచ్చింది. దీనిపై ఆమె తాజాగా స్పందించింది. ఈ బ్రాస్‌లెట్‌లో పూసలు పెట్టుకోవడానికా కారణం కేవలం దిష్టి కోసమే. దాని మీద ఇంత హడావుడి ఏంటి? నేను పెళ్లిని రహస్యంగా చేసుకోను. మీ అందరికీ తెలిపే వివాహం చేసుకుంటానని చెబుతోంది ఈ పిగ్గి ఛాప్స్.