Advertisement
Google Ads BL

రామ్ చరణ్ రంగస్థలం రూ. 200 కోట్లు!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా చిత్రం 'రంగస్థలం'. కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల కావొస్తున్నా సినిమాపై హైప్ అలానే ఉంది. నిన్న ఈ చిత్రంకి సంబంధించి మేకర్స్ ఓ అఫిషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Advertisement
CJ Advs

ఈ చిత్రం రూ. 200 కోట్లను రాబట్టింది అని అఫిషియల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఇంత భారీ కలెక్షన్లు రాబట్టి, 'బాహుబలి' చిత్రాల తరువాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది.

మరోపక్క రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు కూడా ఇవే కావడం గమనార్హం. ఈ చిత్రం వచ్చిన 20 రోజులు తర్వాత  మహేష్ 'భరత్ అనే నేను' వచ్చింది. ఇప్పటికే రూ.180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, 'రంగస్థలం'తో పోటీపడుతూ దూసుకెళుతోంది.

Rangasthalam Enters 200 Crore Club:

Ram Charan and Samantha Akkineni's Rangasthalam enters the 200 Crores club
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs