గతకొన్నిరోజులుగా టాలీవుడ్ పరిశ్రమకి మీడియాకి కోల్డ్ వార్ జరుగుతోంది. ఇక ఈ విషయంపై చాలా మంది బయటపడటం లేదు గానీ ఎవరిలోపాలు దొరికితే ఎవరిపై విరుచుకుపడుదామా?అని మీడియా, సినిమా ప్రముఖులు ఇద్దరు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా ఈ వేడుకకు చీఫ్‌గెస్ట్‌గా వచ్చిన రామ్‌చరణ్ మాట్లాడుతూ, అవినీతిలేని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది ప్రపంచంలో సినిమా పరిశ్రమే. బన్నీ అంకిత భావం, ఆకలి, ప్రతిభ గురించి సినిమాలలోకి రాకముందు నుంచి చూస్తూ వస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో వేడుక ఏదైనా వినోదం పంచే వ్యక్తి బన్నీనే. అతనిలో అంత ఉత్సాహం ఉండేది. బన్నీ డ్యాన్స్ చూసి నువ్వు కూడా డ్యాన్స్ నేర్చుకోరా అని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. 'చిరుత' ముందు వీడికి డ్యాన్స్ వచ్చా? ఎప్పుడు చేయలేదే అని నాన్నగారు అంటే ప్రైవేట్‌గా వాడికి డ్యాన్స్‌వచ్చు అని చాలా బాగాచేస్తాడని మా నాన్నకు బన్నీ ధైర్యం ఇచ్చారు. అర్ధవంతమైన, కమర్షియల్ చిత్రాలంటే మనం తమిళ దర్శకుల వైపు చూస్తూ ఉంటాం. వాణిజ్య పరమైన ప్రయోగాత్మక చిత్రాలంటే తమిళ దర్శకులతో చేద్దామని భావించే వారం. కానీ తెలుగులో ఇప్పుడు అలాంటి చిత్రాలు వస్తున్నాయి.
మనమంతా గర్వపడే స్థాయిలో ఉంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ. దానికి మరో ఉదాహరణ ఈ 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం, చాలా నిజాయితీతో తీసిన చిత్రం ఇది. నా 'ఎవడు' స్టోరీ రాసింది ఈ దర్శకుడే. ఆయన రచన చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆర్మీ నేపద్యంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా సోదరుడు అల్లుఅర్జున్ ఈ చిత్రం చేయడం ఎంతో ఆనందంగాఉంది. బన్నీ ఆత్మ సంతృప్తి కోసమే ఇలాంటి చిత్రాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగమే గోనగన్నారెడ్డి పాత్ర. చిన్నపాత్రే అయినా దానికి పలుఅవార్డులు, పురస్కారాలు వచ్చాయి. అంతటి పవర్‌ఫుల్‌నెస్ రెండున్నర గంటల పాటు ఉంటే అదే 'నా పేరు సూర్య' చిత్రం. దీనికి ఇంకెన్ని పురస్కారాలు వస్తాయో ఊహించుకోవచ్చు.
మా మామ మాటల వెనుక బాధని నేను అర్ధం చేసుకుంటున్నాను. దర్శకులు, నటీనటులు, యూనిట్ అందరు ఒళ్లు హూనంచేసుకుని కష్టపడతాం. మరలా ఇంటికి వచ్చిన తర్వాత రేపు ఏమి చేయాలా? అని ఆలోచిస్తూ ఉంటాం. కుటుంబంతో గంట గడిపి మరలా ఉదయాన్నే వెళ్లిపోతుంటాం. ఇక్కడ ఏమి అవినీతి జరుగుతోంది.? మరి రెండు నెలలుగా మీడియా.. ఇండస్ట్రీ గురించి ఎందుకు ఇలా రాస్తోంది?బ న్నీకే కాదు నాకు, మానాన్నకి, ప్రభాస్‌కి,ఎన్టీఆర్‌కి, బాలకృష్ణకి అందరికీ ఎన్నోసార్లు గాయాలయ్యాయి. ఇదంతా ప్రేక్షకులకు అర్ధమవుతుంది. వారేమీ అమాయకులు కాదు. నిజమైన మనిషి మనసులో పెట్టుకోడు. ఇలాంటివి నమ్మడు. మాకు మీడియా సహకారం కావాలి. మీరు బతకండి.. మమ్మల్ని బతకనీయండి...అందరం సంతోషంగా ఉందాం అని వ్యాఖ్యానించాడు.