Advertisement
Google Ads BL

గౌతమి ఎవరు?- శృతి హాసన్!


కమల్‌హాసన్‌, సారికాహాసన్‌లకు పుట్టిన సంతానమే శృతిహాసన్‌, అక్షరహాసన్‌. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కమల్‌లో మార్పు రాకుండా మరలా గౌతమితో సహజీవనం మొదలుపెడితే ఆత్మహత్యయత్నం కూడా చేసుకోవాలని భావించిన సారికా హాసన్‌ తర్వాత కమల్‌తో విడిపోయింది. కానీ పిల్లలు ఇద్దరిని మాత్రం కమల్‌హాసన్‌ తన వద్దే ఉంచుకున్నాడు. తనకి తండ్రి చిన్ననాడే దూరమయ్యాడని, మగతోడు లేకనే తాను ఇలా తయారయ్యానని భావించిన సారికా కూడా తన పిల్లలకు తండ్రి లేని లోటు ఉండకూడదని భావించిన తన పిల్లలను తండ్రి వద్దనే ఉంచింది. 

Advertisement
CJ Advs

ఇక కమల్‌హాసన్‌, గౌతమిల సహజీవనం సమయంలో కూడా గౌతమి తన కుమార్తె సుబ్బులక్ష్మిని చూసిన విధంగానే శృతిహాసన్‌, అక్షర హాసన్‌లను చూసేదని, ఎంతో ఆప్యాయంగా వారితో ఉండేదని అంటారు. కానీ గౌతమి మీద మోజు తీరగానే కమల్‌హాసన్‌ ఆమెని కూడా వదిలేశాడు. అయితే కేవలం కమల్‌హాసన్‌, గౌతమిలు విడిపోవడానికి కారణం శృతిహాసన్‌ అనే చెబుతారు. ఇక ఈ విషయంపై శృతిహాసన్‌ మాట్లాడుతూ, గౌతమి అనే వారు ఎవ్వరూ నా జీవితంలో లేరు. నా జీవితంలో లేని వారి గురించి నేను ఎలా మాట్లాడగలను? ఇక మైఖేల్‌కోర్స్‌లే నాకు మంచి స్నేహితుడు. ఇక ఈయనతో ఇప్పుడు వివాహం లేదు. నిజంగా నేను పెళ్లి చేసుకునే నాడు మీకు చెబుతాను. మా ఇంట్లో వారు నా అభిప్రాయాలకు విలువ ఇస్తారు. 

తొమ్మిదేళ్లు నిరంతరాయంగా కష్టపడిన తర్వాత కాస్త విరామం తీసుకోవాలని అనిపించింది. అందుకే కొత్త చిత్రాలు ఒప్పుకోలేదు. ప్రస్తుతం మాత్రం ఆ కథలను వింటున్నాను. ఇక నాన్నకు రాజకీయాలలో సలహా ఇచ్చేంతదానిని కాదు. అది సొసైటీతో కూడిన పని. నాకు రాజకీయాలు తెలియవు.ఇక నేను నాడు తెలుగు బాగా నేర్చుకున్నాను. కానీ ఈమద్య తెలుగు మాట్లాడే వారు నా పక్కన లేకపోవడంతో కాస్తమర్చిపోయాను. మరలా పూర్తిగా నేర్చుకుంటాను. ఇక నటనేకాదు నిర్మాణం, సంగీతం, రచన వంటివి కూడా నాకు ముఖ్యమేనని తెలిపింది..! 

Who is Gouthami? asked Shruti Haasan:

Shruti Haasan Sensational Comments On Gauthami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs