సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. ఈ సినిమాను బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీద వెళ్తుంది అనుకున్న టైంలో డైరెక్టర్ తేజ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.
తేజ అలా సడన్ గా తప్పుకోవడానికి కారణం బాలకృష్ణ తనకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. తేజ వెళ్ళిపోయాక ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనుకున్న టైంలో తెర మీదకు పూరీ పేరు వచ్చింది. ఒకవేళ పూరీ కాకపోతే బాలకృష్ణ తానే స్వయంగా ఆ సినిమాను దర్శకత్వం చేయనున్నాడు.
అసలు విషయానికి వెళ్తే డైరెక్టర్ తేజ నాగార్జునకి ఓ కథ చెప్పిన్నట్టు తెలుస్తుంది. నాగార్జున కూడా తేజ చెప్పిన కథకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంట. ప్రస్తుతం తేజ వెంకటేష్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా అయ్యిపోయాక నాగ్ తో సినిమా వుండే అవకాశం ఉంది. మరోపక్క నాగ్ సినిమా కోసమే తేజ 'ఎన్టీఆర్' బయోపిక్ నుండి తప్పుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మరి ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.