ఈ ప్రపంచంలో కరప్షన్ లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఒక సినీ ఇండస్ట్రీయే అని నిన్న జరిగిన నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై అయన తనదైన శైలిలో స్పందించారు.
తన మామ అల్లు అరవింద్ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుందని...ఆయన ఎందుకు అలా చేస్తున్నారో అర్ధం కావట్లేదని.. అయన ఎంత బాధతో మాట్లాడతారో తాను అర్థం చేసుకోగలనని అన్నాడు. మీరే ఆలోచించండి మేము మార్నింగ్ ఐదు గంటలకు నిద్రలేచి.. జిమ్ కి వెళ్తాము..తర్వాత మేక్ అప్ వేసుకుని షాట్ వెళ్తాము. తిరిగి మళ్లీ నైట్ ఎనిమిదింటికి ఇంటికి వచ్చి కాసేపు ఇంట్లో వాళ్లతో గడుపుతాం. ఎండ..వాన అని సంబంధం లేకుండా కష్టపడుతున్నప్పుడు కరప్షన్ జరిగే ఛాన్స్ ఎక్కడ ఉందని తన మనసులో బాధను వ్యక్తం చేశాడు చరణ్.
బన్నీకి రిస్కీ షాట్ల కారణంగా ఎన్ని గాయాలు అయ్యాయో తనకు తెలుసునని..అలానే చాలా మందికి హీరోలకి గాయాలు అయ్యాయి మహేష్ బాబు, తారక్, ప్రభాస్ లకూ గాయాలు అయ్యాయని అన్నాడు. ఇటీవల చిరంజీవి గారికి.. బాలకృష్ణ గారి షోల్డర్ ఇంజురీ అయిందని గుర్తు చేశాడు. ఇలా ఒళ్లు హూనం చేసుకుంటూనే తామంతా కష్టపడుతున్నామని తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు రామ్ చరణ్.