Advertisement
Google Ads BL

అద్భుత విజయం దిశగా హాలీవుడ్ మూవీ!


భాషతో సంబంధం లేకుండా ప్రాంత భేదాలు లేకుండా ఈ శుక్రవారం విడుదల అయిన హాలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’ బాక్స్ ఆఫీస్ వద్ద దాడి మామూలుగా లేదు. బాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలన్నింటి కంటే తొలి రోజు ‘ఎవెంజర్స్’కే అత్యధిక వసూళ్లు రావడం విశేషం. దీంతో ఈ సినిమా రూ.32 కోట్ల దాకా గ్రాస్ వసూలు మొదటి స్థానంలో నిలిచింది. 

Advertisement
CJ Advs

రెండో స్థానంలో ‘బాగి-2’ రూ.25 కోట్లతో ఉంది. ‘పద్మావతి’ రూ.19 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఒక హాలీవుడ్ మూవీ బాలీవుడ్ చిత్రాల్ని మించి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అనూహ్యమైన విషయం. గతంలో ‘అవతార్’.. 'జంగి ల్ బుక్' సినిమాలకు హైప్ అయితే వచ్చింది కానీ ఈ స్థాయిలో వసూల్ అయితే రాలేదు. భాషతో సంబంధం లేకుండా అందరు ఈ సినిమాను చూడడంతో వసూల్ సునామిలా వచ్చి పడుతున్నాయి.

వారాంతంలోనే ఈ చిత్రం రూ.100 కోట్లకు చేరువుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వీకెండ్లో ఈ చిత్రానికి టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఫుల్ రన్లో రూ.200 కోట్ల మార్కును కూడా అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. చిన్నవాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు సినిమాపై అమితాసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

'Avengers: Infinity War' Box Office: A Rundown of the Records Broken:

'Avengers: Infinity War' Box Office Sensation in Bollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs