Advertisement
Google Ads BL

'నాపేరు సూర్య' ట్రైలర్: మరో బ్లాక్‌బస్టరే!


ఈ సమ్మర్‌లో ఇప్పటికే 'రంగస్థలం', 'భరత్‌ అనే నేను' వంటి పూర్తి విభిన్నచిత్రాలను తెలుగుప్రేక్షకులు బ్లాక్‌బస్టర్స్‌ని చేశారు. ఇక రాబోయేది మే4వ తేదీన విడుదల కానున్న 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. రామ్‌చరణ్‌, మహేష్‌బాబుల లాగానే అల్లుఅర్జున్‌ కూడా తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో అరిపిస్తున్నాడు. ఎంతో కోపంగా ఉండే అగ్రెసివ్‌ నేచర్‌ ఉన్న ఆర్మీఆఫీసర్‌గా బన్నీ అదరగొడుతున్నాడు. ఇక మిలటరీ వారి మేకోవర్‌ కూడా అదిరిపోతోంది. కోపం, ఆవేశం ఉన్న పాత్రకి తోడు లవ్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌ని మిక్స్‌ చేస్తూ దేశభక్తికి కంటెంట్‌ను మిళితం చేయడం అంటే ఖచ్చితంగా దీనిని బ్లాక్‌బస్టర్‌ ఫార్ములానే అనిపించేలా ఉంది. 

Advertisement
CJ Advs

ఇక అల్లుఅర్జున్‌తో పాటు అను ఇమ్మాన్యుయేల్‌, శరత్‌కుమార్‌, అర్జున్‌లు కూడా బాగా కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌లో 'నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి... మంత్రాలు రావు...', 'క్యారెక్టర్‌ వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడమే..చావు రాకముందే చచ్చిపోవడమే' అని బన్నీ చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్స్‌ అదిరిపోయాయి. ఇక రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ, విశాల్‌-శేఖర్‌లు అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదిరిపోయింది. 

ఇక విపరీతమైన కోపం కలిగిన ఓ ఆర్మీ ఆఫీసర్‌ ఓ టెర్రరిస్ట్‌ని చంపి, ఉద్యోగం పొగొట్టుకుని వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అనేది సినిమాకి మూలమైన లైన్‌ అనిపిస్తోంది. మొత్తానికి ఈట్రైలర్‌ కట్‌ చేసిన విధానమేకాదు.. సీన్స్‌ చిత్రీకరణ పరంగా వక్కంతం వంశీ కూడా తాను ఓ కొత్త దర్శకుడిని అనే ఫీల్‌ని పోగొట్టాడు. మొత్తంగా చూస్తుంటే వరుసగా 'రంగస్థలం, భరత్‌ అనే నేను'ల తర్వాత బన్నీ కూడా బ్లాక్‌బస్టర్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందనే నమ్మకం ఈ ట్రైలర్‌ని చూస్తే అర్ధమవుతోంది. 

Click Here For Trailer

Naa Peru Surya Naa Illu India Trailer Released:

<h3 class="text-center"><span style="font-weight: normal;">Naa Peru Surya Naa Illu India Trailer Report</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs