Advertisement
Google Ads BL

మహేష్‌ మాట తప్పేది లేదంటున్నాడు!


మహేష్‌బాబు మొదటి నుంచి తాను రాజకీయాలకు దూరమని, కేవలం తన బావ గల్లాజయదేవ్‌ని మాత్రమే నేను నమ్ముతానని చెప్పి, కేవలం గల్లాజయదేవ్‌కి మాత్రమే కిందటి ఎన్నికల్లో ఓట్లు వేయమని తన అభిమానులను కోరాడు. ఇక తాజాగా ఈయన 'బ్రహ్మోత్సవం, స్పైడర్‌' వంటి డిజాస్టర్స్‌ తర్వాత 'భరత్‌ అనే నేను'తో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. ఈ సందర్భంగా ఆయన తన దర్శకుడు కొరటాల శివతో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చాడు. తన బావగల్లా జయదేవ్‌, కొరటాలశివతో కలిసి ఆయన శ్రీ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాడు. అనంతరం గవర్నర్‌ పేటలోని అన్నపూర్ణ థియేటర్‌కి వెళ్లి ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూశాడు. ఆ తర్వాత గుండె ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులను ఆంధ్రా హాస్పిటల్‌కి వెళ్లి వారితో సెల్ఫీలు దిగాడు. ఇక అభిమానులతో ముచ్చటించి, మీడియాతో మాట్లాడాడు. 

Advertisement
CJ Advs

తనకు విజయవాడ సెంటిమెంట్‌ బాగా ఉందని, గతంలో కూడా 'ఒక్కడు, పోకిరి,, దూకుడు' విజయోత్సవ వేడుకను విజయవాడలోనే జరిపానని అన్నారు. నేను వందేళ్లు వచ్చేవరకు సినిమాలలోనే నటిస్తూ ఉంటానని, రాజకీయాలలోకి మాత్రంరానని స్పష్టం చేశాడు. మరోవైపు ఆంధ్రా హాస్పిటల్స్‌, ఇంగ్లాండ్‌కి చెందిన లిటిల్‌హెవెన్స్‌ సంస్థ కలిసి మూడు వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశారు. ఆ చిన్నారులు, వారి తల్లిదండ్రులను మహేష్‌ కలిశాడు. గత రెండేళ్లుగా గుండె ఆపరేషన్‌ అవసరమైన చిన్నారులకు మహేష్‌ ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన బుర్రిపాలెంలో కూడా వైద్యశిబిరాలను ఏర్పాటు చేయిస్తున్నాడు. త్వరలో చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన ఓ షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసేందుకు కూడా మహేష్‌ సంసిద్దత తెలిపాడు...! 

మరోవైపు మేడమ్‌ టూస్సాడ్‌ మ్యూజియంలోమహేష్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్వాహకులు నిర్ణయించారు. దీనికి సంబంధించి మహేష్‌ కొలతలను, ఫొటోలను కూడా తీసుకున్నారు. మరి దీనిని లండన్‌, బ్యాంకాక్‌, ఢిల్లీలలో ఎక్కడ పెడతారో వేచిచూడాల్సివుంది. ఇంతకు ముందు ఈ ఘనత కేవలం 'బాహుబలి'లో నటించిన ప్రభాస్‌కి మాత్రమే దక్కింది. ఇప్పుడు తెలుగు నుంచి ఈ ఘనత సాధించిన రెండో హీరోగా మహేష్‌బాబుని చెప్పుకోవాలి. 

No Politics Says Mahesh Babu:

'I Will Remain an Actor' mahesh babu says he has no plans to enter politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs