టాలీవుడ్ స్టార్స్‌లో ఆరు మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న ఏకైక స్టార్ సూపర్‌స్టార్ మహేష్. ట్విట్టర్‌తో ఈయనకు అంతగా ఫాలోయింగ్ ఉంది. అలాగని మహేష్ నిరంతరంగా ఎప్పుడు ట్వీట్స్ చేయడు. ఎప్పుడో మంచి సందర్భం, తన కుటుంబానికి చెందిన ముఖ్య విషయం, ఎంతో మంచి సినిమా ఫాలోఅప్‌లకు మాత్రమే ఆయన పరిమితం. మిగిలిన వారితో పోలిస్తే మహేష్ ట్విట్టర్‌లో పెద్దగా యాక్టివ్ ఏమీ కాదు. అయినా అరుదుగా ఆయన చేసే పోస్ట్‌లకే ఇంతమంది ఫాలోయర్స్ ఉండటం సాధారణం ఏమీ కాదు.
ఇక ఆరు మిలియన్ల మంది ఫాలోయర్లను కలిగిన మహేష్ తాను మాత్రం ట్విట్టర్‌లోఇప్పటిదాకా ఒకే ఒక్కరిని ఫాలో అయ్యాడు. ఆయనే ఆయన బావ గల్లా జయదేవ్. ఇక ఇప్పుడు ఆయన మరో వ్యక్తిని కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. తనకు 'శ్రీమంతుడు, భరత్ అనే నేను' వంటి ఇండస్ట్రీహిట్స్‌ని ఇచ్చిన కొరటాల శివను కూడా మహేష్ ఫాలో కావాలని నిర్ణయించుకున్నాడు. 'శ్రీమంతుడు' సమయంలోగానీ, నేడు 'భరత్ అనే నేను' విషయంలోగానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు ఇండస్ట్రీ హిట్స్‌ని అందించిన అరుదైన ఘనతను కొరటాల శివ సాధించాడు.
ఇక 'శ్రీమంతుడు' సక్సెస్ తర్వాత మహేష్‌బాబు కొరటాల శివకు ఓ ఖరీదైైన కారును బహుమతిగా ఇచ్చాడు. ఇక ఇటీవల ఆయన తన 'భరత్ అనే నేను' విషయంలో కూడా ఈ చిత్రం సాధిస్తున్న విజయం చూసి ఉద్వేగానికిలోనై కొరటాలశివను హత్తుకున్నాడు. మొత్తానికి కొరటాల వంటి జీనియస్, అన్ని అంశాలపై పట్టు ఉన్న కొరటాలశివను ఫాలోకావడం అనేది మహేష్ తీసుకున్న మంచి నిర్ణయం అనే చెప్పాలి...!