Advertisement
Google Ads BL

మహేష్‌ బావతో పవన్‌ ట్వీట్ల యుద్దం!


తాజాగా తెలుగుదేశం గుంటూరు ఎంపీ, మహేష్‌బాబు బావ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ, త్వరలో పవన్‌-జగన్‌ అనే సినిమా రానుందని, దీనికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ప్రశాంత్‌ కిషోర్‌ కాగా మోదీ-షాలు నిర్మిస్తున్నారని సెటైర్‌ విసిరాడు. దానితో జనసేన కూడా స్పందించింది. దీనికి బదులు ఇస్తూ జనసేన ట్వీట్‌ చేస్తూ, వన్డే మ్యాచ్‌లా గల్లా జయదేవ్‌ ఒకసారి మాట్లాడి మౌనం పాటిస్తున్నారు. దాని వెనుక మర్మం ఏమిటి? బ్యాటరీ డౌన్‌ అయిన మాటలు మానేసి ప్రత్యేకహోదా తెచ్చే ప్రయత్నాలు చేయాలని చురక అంటించింది. 

Advertisement
CJ Advs

దానికి గల్లా జయదేవ్‌ కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. నేను లోక్‌సభలో సెంచరీ కొట్టాను. ఈ నాలుగేళ్లలో నేను లోక్‌సభలో 100సార్లు మాట్లాడాను. ప్రత్యేకహోదా కోసం ప్రధాని, కేంద్రంతో పోరాడుతూనే ఉన్నాం. యుద్దం చేస్తున్నాం. మరి పవన్‌ మాత్రం ప్రధానిపై ఎందుకు ఆధారపడుతున్నారు? ఇంతకీ పవన్‌ ఎవరితో ఫైట్‌ చేస్తున్నారో చెప్పాలి. నా బ్యాటరీలను గురించిచెప్పాలంటే అవి ఎప్పుడు ఫుల్‌చార్జింగ్‌తోనేఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. అవి నిజంగానే ఫుల్‌ చార్జింగ్‌తో ఉంటాయని బ్యాటరీలను ఉద్దేశించి గల్లాపై పవన్‌ వేసిన కౌంటర్‌కి గల్లా జయదేవ్‌ అదిరిపోయే సమాధానం ఇచ్చాడని మాత్రంచెప్పాలి...!

War Between Pawan Kalyan and Galla Jayadev:

<h3 class="r">Pawan Kalyan vs Jayadev Galla&nbsp;</h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs