Advertisement
Google Ads BL

కాజల్ తో మరొకటి కన్ఫర్మ్ అంట..!


మాస్ రాజా రవితేజ 'నేల టిక్కెట్టు' సినిమాతో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత రవితేజ.. శ్రీను వైట్ల డైరెక్షన్ లో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమా కొంతవరకు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో రవితేజకి జోడిగా అను ఇమ్మానుయేల్ నటిస్తుంది. మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ రెండు సినిమాలే కాకుండా రవితేజ తన మూడో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది. తమిళ్ లో విజయ్ నటించిన 'తెరి' మూవీని స్ఫూర్తిగా తీసుకుని ఓ కథను సిద్ధం చేసుకున్నాడు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమాలో టాలీవుడ్ క్వీన్ కాజల్ హీరోయిన్ గా చేస్తుంది. రవితేజ - కాజల్ కాంబినేషన్ లో వచ్చిన 'వీర' .. 'సారొచ్చారు' సరిగ్గా ఆడలేదు. అందువలన ఈ సినిమా చేయడానికి కాజల్ ఆసక్తిని చూపలేదట. కానీ ఆ తరువాత ఆమెను ఒప్పించారనేది తాజా సమాచారం. మరి ఈసారైనా ఈ జంట హిట్  కొడుతుందేమో చూడాలి. 

Kajal Agarwal-Ravi Teja set for hat trick!:

Ravi Teja and Kajal Agarwal to team up for the third time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs