Advertisement
Google Ads BL

'రంగమ్మత్త' తపన కనిపిస్తోంది!


కలెక్షన్లు, విజయంలోనే కాదు.. సినిమా పరంగా కూడా 'రంగస్థలం'ని మాస్టర్‌పీస్‌ అని చెప్పవచ్చు. ఇక నేటి రోజుల్లో స్టార్‌ హీరోలు సినిమాలు ఒప్పుకుంటే చాలు ఏదో ఒక కథను తీసుకుని, ఆయా స్టార్స్‌కి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఆల్‌రెడీ తమ కథలనే ఆయా హీరోలకు తగ్గట్లుగా మార్పులు చేస్తూనే మరోవైపు కథకి తగ్గ హీరో అని మాటల గారడీ చేస్తున్నారు తప్ప ఏ హీరో ఒప్పుకుంటే అందుకు అనుగుణంగా కథను మార్చడంలో మన వారు మహా మేధావులే. అయితే తెలుగులో క్రియేటివ్‌ జీనియస్‌గా ప్రస్తుత తరంలో పేరు సాధించిన సుకుమార్‌ మాత్రం ఇప్పటికీ కథను బట్టే హీరోని సెలక్ట్‌ చేసుకుంటున్నాడు. అంతే కాదు.. ఎవరోబిజీగా ఉన్నవారు కూడా నటించడానికి ఓకే చెప్పేశారని వారిని తీసుకోవడం అనే పద్దతికి సుకుమార్‌ బద్ద విరోధి అని తాజాగా రుజువైంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే 'రంగస్థలం' చిత్రంలో పల్లెటూరి యంగ్‌ ఆంటీ తరహాలో రంగమ్మత్తగా అనసూయ అదరగొట్టేసింది. కానీ ఈ పాత్ర కోసం ఆమె ఆడిషన్స్‌కి కూడా వెళ్లింది. అక్కడ రంగమ్మత్త పాత్రకు తగ్గట్లుగా వేషధారణ, డైలాగ్స్‌ వంటివి చెప్పి వావ్‌ అనిపించింది. ఆడిషన్స్‌ చేశారు కాబట్టే అనసూయకి ఖచ్చితమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ ఆడిషన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి అనసూయ పట్టుదల, ఆ పాత్రలో ఆమె ఒదిగిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పాలి. 

ఇక తాజాగా అనసూయకి మరో మంచి అవకాశం వచ్చిందని తెలుస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా హ్యాట్రిక్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు హీరోగా చేయబోయే మల్టీస్టారర్‌లో కూడా ఈమెకి ఎంతో కీలకమైన పాత్ర లభించిందట. ఇక తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఐడెంటిటి. తన పేరు మీదనే పాట రాయించేలా ఎదిగిన అనసూయకి ఇక వరుస అవకాశాలు రావడం ఖాయం. మరి ఆమె తన పాత్రను ఎంత సెలక్టివ్‌గా ఎంచుకుంటుంది అనేది వేచిచూడాల్సివుంది!

Anusuya in F2 Movie:

Anasuya Rangasthalam Auditions Video Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs