Advertisement
Google Ads BL

ద్రౌపది పాత్ర ఈ స్టార్ హీరోయిన్ చేస్తుందా?


పద్మావతి సినిమాలో రాణి పద్మావతిగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటన ఎప్పటికి మరిచిపోలేనిది. బాజీరావు మస్తానీలో కూడా దీపికా నటన ఎప్పటికి మరువలేనిది. చారిత్రాత్మక చిత్రాలకు దీపికా పెట్టింది పేరు. పొడుగుకాళ్ల సుందరి దీపికా బికినీ వేసినా... నిండైన డ్రెస్ వేసినా కూడా ఆమె అందాలు అందరిని ఆకర్షిస్తాయి. అలాగే చారిత్రాత్మక చిత్రాలలో ముందుగా దీపికానే సెలెక్ట్ చేసేందుకు దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అయితే రాణి పద్మావతిగా స్టార్ హీరోలకు సాటిగా పద్మావతీ చిత్రంతో కోట్లు కొల్లగొట్టిన దీపికా పదుకొనె ఇప్పుడు మరో చారిత్రాత్మక చిత్రంలో నటించబోతుందనే న్యూస్ వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తలపెట్టిన మహాభారత చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు గాని... ఈ సినిమా మాత్రం అనేక పార్టులుగా విభజించి తెరకెక్కుతోందని అప్పుడెప్పుడో అమీర్ ఖాన్ చెప్పాడు. మళ్ళీ ఈ లోపు చారిత్రాత్మక చిత్రాలు విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకోవడం.. అమీర్ ముస్లిం కావడంతో.. మహాభారత ని ఎలా తెరకెక్కస్తాడంటూ కొందరు చేసిన వ్యాఖ్యలతో అమీర్ మహాభారత ప్రాజెక్ట్ విషయమై వెనక్కి తగ్గాడని అన్నారు. కానీ ఇప్పుడు మహాభారత ప్రాజెక్ట్ ఉంటుందని.. మహాభారత లో కీలక పాత్రధారి ద్రౌపది పాత్రకి దీపికా పదుకొనె అయితే బావుంటుందని ...అమీర్ ఆలోచనగా బిటౌన్ వర్గాల సమాచారం.

అయితే దీపికా పదుకొనె పద్మావతి చిత్రం తర్వాత మళ్లీ ఇప్పట్లో ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు చెయ్యనని.. పద్మావతి సినిమాతో చాలా సఫర్ అయ్యానని చెప్పింది. అయితే ఆమెని ఎలాగైనా ద్రౌపది పాత్రకి ఒప్పించాలని.. ఒకవేళ ఆమె దగ్గర కాల్షీట్స్ ప్రాబ్లెమ్ ఉన్నప్పటికీ...  ఎలాగైనా కన్విన్స్ చేయాలని అమీర్ అండ్ కో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి భారీ బడ్జెట్ తో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ మహాభారత ని తెరకెక్కిస్తున్నాడు. మరి ద్రౌపది పాత్రకి దీపికా ఓకె చేబితే.. మిగతా ముఖ్యమైన పాత్రలకు కూడా స్టార్ నటీనటులనే తీసుకోవాలనే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే కథ రచయితలూ మహాభారత ప్రాజెక్ట్ మీద కూర్చున్నట్లుగా సమాచారం.

Aamir Khan Wants to Deepika Padukone Cast for Draupadi Roll in Mahabharat:

Would Deepika Padukone agree to play Draupadi in Aamir Khan’s Mahabharat?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs