Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీలో ఇదే హైలైట్‌..!


'జైలవకుశ' తర్వాత ఎంతో గ్యాప్‌ తీసుకున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడు ఎదుర్కోని విమర్శలను తాజాగా పవన్‌కళ్యాణ్‌తో చేసిన 'అజ్ఞాతవాసి'తో మూటగట్టుకున్న త్రివిక్రమ్‌ ఈ చిత్రంతో తన సత్తా ఏమిటో మరలా నిరూపించే ప్రయత్నాలో ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మాస్‌ఇమేజ్‌ని వాడుకుంటూనే, తనదైన ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. కొన్నియాక్షన్‌ సీన్స్‌ని అక్కడ షూట్‌చేసుకున్నారు. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి కావడంతో మే 3వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ఇక ఇందులో ఎన్టీఆర్‌ మరోసారి సిక్స్‌ప్యాక్‌ బాడీ కోసం రివాటుగా బలిష్టంగా కనిపిస్తున్న ఫొటోలు అందరినీ అలరిస్తున్నాయి. ఇక మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లతో కలిసి ఎన్టీఆర్‌ తీసుకున్న ఫొటోలో ఈ చిత్రంలోని గెటప్‌లోనే ఎన్టీఆర్‌ కనిపిస్తున్నాడు. ఇటీవల మహేష్‌'భరత్‌ అనే నేను' వేడుకకు హాజరైనప్పుడు కూడా ఎన్టీఆర్‌ న్యూలుక్‌ ఇదేనని ఫిక్సయ్యారు. 

మొత్తానికి 'యమదొంగ' చిత్రంలోని ఎన్టీఆర్‌ గెటప్‌ తరహాలోనే ఈ చిత్రంలోని గెటప్‌ కూడా ఉండనుందని అంటున్నారు.ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తనచిత్రాలలో సీనియర్‌ నటీమణులకు ప్రత్యేకమైన కీలకమైన పాత్రలను సృష్టిస్తూ ఉంటాడు. 'అత్తారింటికి దారేది'లో నదియా, 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూలను తీసుకున్నట్లు ఇందులో కూడా ఓ నటీమణికి కీలకమైన పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో లయ పేరు కూడా ఈ పాత్రకి వినిపించింది. కానీ వాటిని ఆమె తోసిపుచ్చింది. ఇక ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో 'నరిసింహ'లోని నీలాంబరి, 'బాహుబలి'లోని శివగామిగా నటించిన రమ్యకృష్ణని ఈ పాత్రకోసం ఎంపిక చేశారని అంటున్నారు.

ఇక గతంలోనే 'నా అల్లుడు' చిత్రంలో రమ్యకృష్ణకి అల్లుడిగా ఎన్టీఆర్‌ నటించాడు. ఇక ఇటీవల వచ్చిన 'గ్యాంగ్‌' చిత్రంలో కూడా సూర్యతో కలిసి రమ్యకృష్ణ నటించింది. మొత్తానికి ఎన్టీఆర్‌ -త్రివిక్రమ్‌ చిత్రంలో రమ్యకృష్ణ ఉంటే మాత్రం ఆవిడ కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మిగులుతుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ నాగచైతన్య అత్తగా 'శైలజారెడ్డి అల్లుడు' అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

Jr NTR And Trivikram Srinivas Movie Latest Updates:

Ramya Krishna, Khushboo or Nadhiya Who will be seen in Trivikram Srinivas and Jr NTR film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs