తెలుగులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీది సరికొత్త పంధా. ఆయన తన చిత్రాలలో తనదైన హాస్య సంభాషణలు, మేనరిజమ్స్, స్పూఫ్‌లతో బాగా అలరిస్తాడు. ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ, నేను ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే 'ఖడ్గం' మూవీ పోస్టర్ చూస్తాను. ఆ చిత్రం లేకపోతే నేను లేను, నా మేనరిజమ్స్ లేవు. సినిమాలో నా పాత్రకి సంబంధించిన తర్జనభర్జనలు జరిగాయి. చివరికి ఈ పాత్ర ఇలా ఉంటుంది అనే అవుట్‌పుట్ మాత్రం కృష్ణవంశీ నుంచే వచ్చింది. 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అని నేను డైలాగ్ చెప్పేటప్పుడు యూనిట్‌లోని అందరు నవ్వేశారు. దాంతో ఈ పాత్ర బాగా పేలుతుందని నాడే నాకు అర్ధమైంది.
నేను మొదటి నుంచి అందరికీ ఒకే విషయం చెబుతూ ఉంటాను. నేను కమెడియన్‌ని కాదు. నాహైట్, పర్సనాలిటీ చూసిన వారెవ్వరూ నేను కమెడియన్‌ని అని అంటే నమ్మలేరు. 'శ్రీఆంజనేయం' చిత్రం తర్వాత నన్ను చూసి పిల్లలు భయపడిపోయేవారు. మా బంధువుల పిల్లలు కూడాభయపడే వారు. నా పర్సనాలిటీ అలాంటిది. తిరుపతిలో ఈ చిత్రంరిలీజ్ రోజున ధియేటర్‌లో చిత్రం చూస్తూ ఉన్నాను. నా ముందు సీట్లలో ఓ ఫ్యామిలీ కూర్చునిఉంది. వారి పిల్లాడు సినిమా ప్రారంభంకాకముందు నావైపు చూసి నవ్వాడు. చిత్రంలో నా పాత్ర ఎంటర్‌కాగానే పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. దాంతో ఆ ఫ్యామిలీ ఏమీ అనుకోవద్దు. కాసేపు బయటికి వెళ్లండి అన్నారు. నేను బయటికి వచ్చి తలుపుల వద్ద నిలబడి సినిమా చూశాను. సినిమా అయిపోయిన తర్వాత ఆ పిల్లాడి తల్లిదండ్రులు చాలాబాగా చేశారు అని మెచ్చుకున్నారు.
ఇక 'సీతారామయ్య గారి మనవరాలు' చిత్రం షూటింగ్‌జరుగుతోంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త అది. దర్శకుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. నేను వెళ్లి సార్ 'ఏదైనా వేషం ఇప్పించండి సార్ అని అడిగాను. ప్రతి ఒక్కడు వేషాలు అడిగే వాడే అని దర్శకుడు క్రాంతి కుమార్ ఈసడించుకున్నారు. నా మొహం చూసేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. చివరకు ఏదైనా ఫర్వాలేదు. వెనకాల నిల్చోమన్నా నిల్చుంటాను అని చెప్పాను. ఏంచదివావు? అని అడిగారు. ఎంఏ చేశాను సార్ అన్నాను. అయితే ఆ వెనుక నించో 50 రూపాయల ఇచ్చిబోజనం పెడతాను అన్నారు. నాకు కోపం వచ్చింది. అడ్డాలోని కూలీలా కనిపిస్తున్నానా అనిపించి మా ఇంట్లో పాలేరుకి భోజనం పెట్టి 100 రూపాయలు ఇస్తాను సార్ అంటూ వెళ్లిపోయాను.