Advertisement
Google Ads BL

కొరటాల అతనితోనేనా..?


ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ చిత్రాలు చేయడంలేదు. మహేష్‌బాబు, వంశీ పైడిపల్లి చిత్రం, ఆ తర్వాత సుకుమార్‌ చిత్రాలు చేయనున్నాడు. ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ చిత్రం, తర్వాత రాజమౌళితో మల్టీస్టారర్స్‌ చేయాల్సి ఉంది. మరోవైపు చరణ్‌ కూడా బోయపాటి శ్రీను, రాజమౌళి చిత్రాలలో బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌ 'సాహో' తర్వాత చిత్రాన్ని తన పెద్దనాన్న కృష్ణంరాజుకి 'జిల్‌' రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఇంకా మరో డైరెక్టర్‌ని కమిట్‌కాని హీరో స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జునే. ఇక ఈయన ప్రస్తుతం వక్కంతం వంశీ అనే రచయితను దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య..నాఇల్లు ఇండియా' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం మే 4వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బన్నీతో చేసేందుకు లింగుస్వామి, విక్రమ్‌ కె.కుమార్‌, సుకుమార్‌, కొరటాల శివ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ లింగుస్వామి, విక్రమ్‌ కె.కుమార్‌లతో బన్నీ చేసే సినిమాలు ఆలస్యం అయ్యే చాన్స్‌లు ఉన్నాయి. అందుకే విక్రమ్‌ కె.కుమార్‌ నానిని లైన్‌లో పెడుతున్నాడు. 

Advertisement
CJ Advs

మరోవైపు సుకుమార్‌ తన తదుపరి చిత్రం బన్నీతో ఉండదని, తాను మహేష్‌తో వంశీపైడిపల్లి చిత్రం తర్వాత సినిమా చేస్తానని చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లోనే మహేష్‌-సుకుమార్‌ల చిత్రం ఉండనుంది. ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నాడని సమాచారం. వినోదానికి సందేశాన్ని జత చేసి, ఆనందంతో పాటు ఆలోచించేలా చేయడం అంత సులభమైన పని కాదు. కానీ కొరటాల శివ తన 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌'లతో పాటు 'భరత్‌ అనే నేను'తో రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టాడు. ఆయన తన తదుపరి చిత్రం బన్నీతో చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగులో నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌ అంటే రాజమౌళి. కానీ సెకండ్‌ప్లేస్‌ కోసం మాత్రం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నుంచి బోయపాటి శ్రీను, వినాయక్‌ల వరకు పోటీ ఉంది. ఇలాంటి సందర్భంలో సెకండ్‌ ప్లేస్‌ని కొరటాల శివకు కట్టబెడుతున్నాయి ట్రేడ్‌ వర్గాలు. ఇక బన్ని చిత్రంతో కూడా హిట్‌ని కొడతాడని, ఆ సత్తా కొరటాల శివకు ఉందని పలువురు భావిస్తున్నారు. 

Koratala Siva Next Movie With Allu Arjun:

Koratala Siva Next Movie With Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs