Advertisement
Google Ads BL

బోయపాటి కేకపుట్టిస్తాడట!!


రామ్ చరణ్ రంగస్థలం సినిమా కలెక్షన్స్ అదరగొట్టేస్తున్నాయి. ప్రస్తుతం రంగస్థలం 200  కోట్ల క్లబ్బులో కాలు కూడా పెట్టింది. గత నెల 30  న విడుదలైన ఈ సినిమా విజయంతో ఎంజాయ్ చేసిన చెర్రీ ప్రస్తుతం బోయపాటి తో చేసే సినిమా షూటింగ్ స్పాట్ కి వెళిపోయాడు. బోయపాటి - చరణ్ ల సినిమా ఎప్పుడో మొదలై మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కానీ చెర్రీ రంగస్థలం లేట్ తో చరణ్ ఇప్పుడు బోయపాటి సినిమా సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. మొదటి షెడ్యూల్ కేవలం చరణ్ లేని సన్నివేశాలను చిత్రీకరించిన బోయపాటి.. ప్రస్తుతం చరణ్ తో అలాగే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ తో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసి చిత్రీకరిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇకపోతే వివేక్ తో కూడిన ఓపెనింగ్ సీన్స్ ని బోయపాటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాడట. అయితే ఈ ఎంట్రీ సీన్స్ లో విలన్ గా చేస్తున్న బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ అదరగొట్టేసాడని చిత్ర బృందం చెబుతుంది. బోయపాటి అనుకున్నదానికంటే ఆ సీన్స్ బాగా రావడంతో బోయపాటితో పాటు చిత్ర బృందం కూడా ఫుల్ ఖుషీగా ఉందట. వివేక్ ఒబెరాయ్ ఆ విలన్ పాత్రలో నటించడం అని చెప్పడం కంటే... జీవించాడనిచెబుతున్నారు. అలా వివేక్ ఒబెరాయ్ నటనను బోయపాటి తెగ మెచ్చేసుకున్నాడనే టాక్ కూడా వినబడుతుంది.

ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ఎంట్రీ సీన్ కి ఫాన్స్ మాత్రమే కాకుండా మాములు ప్రేక్షకులు కూడా కుర్చీలలో నుంచి లేచి విజిల్స్ వేస్తారని... కూడా అంటున్నారు. మరి బోయపాటి సినిమాల్లో హీరోతో సమానంగా విలన్స్ కి మంచి కేరెక్టర్ వస్తుంది. ఆలెక్కన చరణ్ కి పోటీగా ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ఉండబోతున్నాడన్నమాట. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా భరత్ గర్ల్ ఫ్రెండ్ కియారా అద్వానీ నటిస్తుంది.

Ram Charan And Boyapati Second Schedule Details:

Vivek Oberoi shoots his entry scene in Vijayawada for upcoming Ram Charan And Boyapati Srinu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs