Advertisement
Google Ads BL

'ఎన్టీఆర్' బయోపిక్ నుండి తప్పుకున్న తేజ?


తన తండ్రి 'ఎన్టీఆర్' జీవిత కథని 'ఎన్టీఆర్' గా బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ కి దర్శకుడిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తో ఫామ్ లో కొచ్చిన తేజ ని ఏరి కోరి ఎంచుకున్నాడు. ఈ సినిమా గత నెల 29  నే భారీ ఆర్భాటంతో అతిరథమహారధుల మధ్య పూజా కార్యక్రమాలతో మొదలై ఏకధాటిగా రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే మొదటినుండి ఇంత భారీ సినిమా తేజ హ్యాండిల్ చేయగలడా అనే మీమాంశలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ప్లాప్స్ లో ఉన్న తేజ కి ఒక్క సినిమా హిట్ తో ఇంత పెద్ద బాధ్యత మీద పెట్టడం కరెక్ట్ కాదేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది.

Advertisement
CJ Advs

మరి బాలకృష్ణకి తేజ మేకింగ్ స్టయిల్ నచ్చిందో... ఏమో తెలియదు గాని... భారీ బడ్జెట్ తో సాయి కొర్రపాటితో  తో తానూ కూడా కలిసి ఈ సినిమాని తేజ దర్శకత్వంలో తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేనెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న 'ఎన్టీఆర్' బయో పిక్ నుండి దర్శకుడు తేజ బయటికెళ్లిపోయాడనే షాకింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. అయితే తేజ ఉన్నట్టుండి ఎందుకు ఈ బయోపిక్ నుండి బయటకెళ్లిపోయాడనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే  తేజ.. బాలకృష్ణ తో చెయ్యాల్సిన 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం వేంకటేష్ తో చెయ్యాల్సిన 'ఆట నాదే వేట నాదే' సినిమాని పక్కనపెట్టేసాడు. మరి బాలయ్య  మీద నమ్మకంతో ఎన్టీఆర్ బయో పిక్ పై తేజ గత ఆరు నెలలుగా చాలా రీసెర్చ్ చేసాడు. ఇంతలోనే తేజ్ ఇలా ఎన్టీఆర్ బయో పిక్ నుండి తప్పుకోవడం అనేది హాట్ టాపిక్ గా మరింది.

Teja Opted out of NTR Biopic:

<span>'I feel I wouldn't do justice for the film. As such, I've decided to stay out of the film,' says&nbsp;</span><a class="tagLinkInText" title="Find Teja news and other pages here" href="/tag/1/1/teja.html">t</a>eja<span>&nbsp;to the media.&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs