Advertisement
Google Ads BL

అల్లువారబ్బాయ్‌ 'ఎబిసిడి' నేర్చుకోవాల్సిందే!


'గౌరవం' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇటు అల్లు ఫ్యామిలీ, అటు మెగాఫ్యామిలీ అండదండలు, ఏస్‌ ప్రొడ్యూసర్‌ అయిన అల్లుఅరవింద్‌ చిన్నకుమారునిగా, అల్లుఅర్జున్‌ తమ్ముడిగా పేరు తెచ్చుకున్న అల్లుశిరీష్‌కి ఇప్పటివరకు సరైనహిట్‌ రాలేదు. ఆయన తండ్రి తీసిన 'కొత్త జంట' అలాగే 'శ్రీరస్తు.. శుభమస్తు' మాత్రమే ఫర్వాలేదనిపించాయి. ఇక ఆ తర్వాత 'టైగర్‌, ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలతో తనని తాను నిరూపించుకుని, మరీ ముఖ్యంగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో నిఖిల్‌కి సెన్సేషనల్‌హిట్‌ ఇచ్చి, నోట్ల రద్దు సమయంలో కూడా రికార్డు కలెక్షన్లు సాధించిన చిత్రం దర్శకుడైన వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఆయన ఎన్నో ఆశలతో అల్లుఅరవింద్‌ నిర్మాతగా 'ఒక్క క్షణం' చిత్రం చేశాడు. 

Advertisement
CJ Advs

ఇక ఆ తర్వాత అల్లుశిరీష్‌ రొటీన్‌ మాస్‌ చిత్రం చేయాలా? లేక ప్రయోగం చేయాలా? అనే సందిగ్దంలో పడ్డాడు. దానికోసం ఇంతకాలం ఎదురుచూసిన ఆయన చివరకు ఓ మలయాళ రీమేక్‌కి ఓకే చేశాడు. మమ్ముట్టి తనయుడు దుల్కర్‌సల్మాన్‌ నటించిన 'ఎబిసిడి' చిత్రం మలయాళంలో భారీ విజయం సాధించింది. ఇందులో ఓ యూఎస్‌ నుంచి ఇండియాకి వచ్చిన ఎన్నారై సామాన్య జీవితం గడపాలని భావిస్తాడు. మరి ఆ క్రమంలో ఆయనకు ఎదురయ్యే సమస్యలు ఏమిటి? అనేది ఈ చిత్రం ఇతి వృత్తం. ఈ చిత్రం దుల్కర్‌ సల్మాన్‌కి భారీ హిట్‌ని ఇవ్వడమే కాకుండా స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఎమోషన్స్‌, భావోద్వేగ సన్నివేశాలతోపాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. 

ఇక 'ఎబిసిడి' అంటే అర్ధం 'అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్‌ దేసి'. ఈ చిత్రాన్ని పలువురు యంగ్‌ హీరోలు రీమేక్‌ చేయాలని భావించారు. కానీ చివరకు ఈ చిత్రంలో నటించే అవకాశం అల్లుశిరీష్‌కి లభించింది. ఈ చిత్రంద్వారా కొత్త దర్శకుడు సంజీవ్‌ పరిచయం అవుతున్నాడు. జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని మొదలుపెట్టి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక తెలుగులో తమిళ రీమేక్‌లు బాగానే ఆడుతాయి తప్ప మలయాళ రీమేక్‌లు పెద్దగా ఘనవిజయాలు సాధించిన సందర్భలు తక్కువ. ఇక ఆల్‌రెడీ మోహన్‌లాల్‌ చిత్రంలో ఓ పాత్ర చేసిన శిరీష్‌ ఇప్పుడు మలయాళ రీమేక్‌లోనటించడానికి డిసైడ్‌అయ్యాడు. మరి ఈ చిత్రమైన అల్లుశిరీష్‌కి మంచి బ్రేక్‌నిస్తుందేమో వేచిచూడాల్సివుంది...! 

Allu Sirish to star in Telugu remake of Dulquer Salmaan’s ABCD:

Allu Sirish in Telugu remake of Malayalam film ‘ABCD: American-Born Confused Desi’
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs