Advertisement
Google Ads BL

అర్జున్‌రెడ్డి మళ్లీ యూటిట్యూడ్‌ చూపించాడు!


'అర్జున్‌రెడ్డి' చిత్రం పబ్లిసిటీ విషయంలో గాఢ లిప్‌ కిస్‌ ఉండే సీన్‌తో పోస్టర్స్‌ ముద్రించడం, ఇక ఆ చిత్రం వేడుకలోనే ఆయన ఓ బూతు పదాన్ని పదేపదే ఆడియన్స్‌ చేత అనిపించడం తెలిసిందే. నాడు మాత్రం మన సినీ పెద్దలకు మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఆయన మాట్లాడింది తప్పు అనిపించలేదు. పరిశ్రమలో భాగంగా దానిని తప్పు అని ఖండించలేదు.ఇక శ్రీరెడ్డి పలువురు నిర్మాతలు, దర్శకుల విషయంలో ఆరోపణలు చేసినప్పుడు గానీ, ఇతర ఆరోపణల సమయంలో కూడా అల్లుఅరవింద్‌ నుంచి అందరు మౌనం వహించారు. అదే తమ వద్దకి వచ్చేసరికి పవన్‌ మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని అల్లుఅరవింద్‌, నాగబాబులు బయటికి వచ్చి మాట్లాడారు. మరి ఈ విషయం మిగిలిన వారి విషయంలో వారు ముందుగా పరిశ్రమలో సీనియర్లుగా ఎందుకు ముందుకురాలేదు అనేది అసలు ప్రశ్న.

Advertisement
CJ Advs

ఇక వి.హనుమంతరావు వంటి సీనియర్‌ నేత 'అర్జున్‌రెడ్డి' పోస్టర్‌ని చింపడంతో చిల్‌ తాతయ్యా అని తాను అనడమేకాదు... వర్మ చేత కూడా అనిపించినప్పుడు కూడా పరిశ్రమ పెద్దలుగా ఇలా అనకూడదని మన పరిశ్రమ పెద్దలు తెలుసుకోలేకపోయారా? ఇక తాజాగా విజయ్‌దేవరకొండ 'మహానటి' చిత్రంలో సమంతకు తోడుగా ఆమె అసిస్టెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్‌గా ఓ పాత్రను పోషించాడని సమాచారం. ఈయన తాజాగా సావిత్రి ఫోటోను ఉద్దేశంచి 'వాటే కూల్‌ చిక్‌ మహానటి' అని కామెంట్స్‌ని పోస్ట్‌ చేశాడు. దాంతో మహానటి వంటి సావిత్రిని పట్టుకుని చిక్‌ అంటావా అని నెటిజన్లు విజయ్‌దేవరకొండపై నెగటివ్‌ కామెంట్స్‌ పెట్టారు. ఆయన అన్నది 'మహానటి'లో సావిత్రి పాత్రను పోషిస్తున్న కీర్తిసురేష్‌నే అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదు. 

ఆయన 'అర్జున్‌రెడ్డి' సమయంలో చూపించిన యాటిట్యూడ్‌ని, ఏదంటే అది మాట్లాడి పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ఇలాంటి చీప్‌ట్రిక్స్‌ ప్లే చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. కానీ దీనిపై కూడా మన పెద్దలు మాట్లాడరు. ఇక ఈ నెగటివ్‌ కామెంట్స్‌ వస్తూ ఉండటంతో విజయ్‌ స్పందిస్తూ, నన్ను తిట్టేవారు చెన్నైలోని లీలా ప్యాలెస్‌ ఉన్నాను. విచ్చేయండి. మీకు మహానటికి సంబంధించిన ఆడియో వేడుకకు కూడా ఉచితంగా పాస్‌లు ఇస్తాను. మీరంతా ఆ నటి ఉన్న కాలంలో ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పుడు మీలా నీతినియమాలు చెప్పే బ్యాచ్‌ ఆమెని సంసారం విచ్చిన్నం చేసుకుందని, తాగుబోతు అని అన్నారు. 

సావిత్రి మనసు చాలా సున్నితం. ఆమె ఎవరికీ భయపడేవారు కాదు. కష్టాలలో ఉన్న వారికి తన వంతు సాయం చేశారు. ఆమె ప్రేమించాలనుకున్నారు. ప్రేమను పొందాలనుకున్నారు. ఆ తర్వాతే సూపర్‌స్టార్‌ కావాలనుకున్నారు. సావిత్రి చాలా మంచివారు. కానీ పలువురు ఆమెని చాలా రకాలుగా విమర్శించారు. అలా ఆమెను తిట్టిన వారంతా నా వద్దకు వస్తే మహానటి ఆడియో పాస్‌లను వారికి ఇస్తాను. తనని విమర్శించిన వారు ఈ వేడుకు వస్తే ఆమె ఆత్మ కూడా సంతోషిస్తుంది.. అంటూ తనయాటిట్యూడ్‌ని మరోసారి చూపించే ప్రయత్నం చేసి, కావాలనే రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ తేవాలని ఆత్ర పడుతున్నాడని అనిపిస్తోంది. 

Vijay Devarakonda Shocking Comments on Mahanati Savitri:

Vijay Devarakonda courts controversy with 'cool chick' remark on Keerthy's Mahanati poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs